Site icon HashtagU Telugu

Rape Case: చెల్లిని బందించి అక్కపై అత్యాచారం

Rape Case

Rape Case

Rape Case: ఉత్తర ప్రదేశ్ లో దారుణం చోటు చేసుకుంది. ఇద్దరు అక్కాచెల్లెళ్లు స్కూల్ నుంచి తిరిగి వస్తుండగా.. అక్కపై ఓ యువకుడు అత్యాచారం చేశాడు. పాఠశాలకు సమయం ముగియడంతో యువకుడు విద్యార్థినిని వదిలేశాడు. ఇంటికొచ్చిన అక్కాచెల్లెళ్లిద్దరూ తల్లికి తమ బాధను చెప్పుకున్నారు. బాధితురాలి తల్లి ఫిర్యాదు మేరకు ముగ్గురు యువకులపై తీవ్రమైన సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. వివరాలలోకి వెళితే..

ఉత్తర ప్రదేశ్ లోని బులంద్‌షహర్ లో ఈ ఘటన జరిగింది. స్కూల్ నుంచి ఇంటికి వస్తున్న ఇద్దరు అక్కాచెల్లెళ్లను దారిలో ఆకతాయిలు అడ్డుకున్నారు. అక్కను గదిలో బంధించి అతని స్నేహితుడు అత్యాచారానికి పాల్పడ్డాడు. కాగా నిందితుడి స్నేహితులు విద్యార్థిని చెల్లెల్ని బందీగా ఉంచారు.దాదాపు రెండు గంటల పాటు గదిలోనే ఉండిపోయిన విద్యార్థిని తన బంధువులకు తన బాధను వివరించింది. బాధితురాలి తల్లి ఫిర్యాదు మేరకు పోలీసులు ముగ్గురు నిందితులపై కేసు నమోదు చేసి ఇద్దరిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు.

బాధిత కుటుంబం గులావతి పోలీస్ స్టేషన్ పరిధిలో నివసిస్తున్నారు, సెప్టెంబరు 18న అక్కాచెల్లెళ్లిద్దరూ స్కూల్‌కి వెళ్లగా టీచర్ చనిపోయారని తెలిసి సెలవు ప్రకటించారు. ఇద్దరు సోదరీమణులు ఇంటికి తిరిగి వస్తుండగా, ముగ్గురు టీనేజ్ విద్యార్థులు వారిని ఒక మతపరమైన ప్రదేశంలో అడ్డుకున్నారు. ఈ ముగ్గురు టీనేజర్లలో ఒకరితో అక్క స్నేహంగా ఉండేది. నిందితుడు యువకుడు తన స్నేహితురాలిని ఆశ్రమంలోని గదికి ఈడ్చుకెళ్లి తలుపులు మూసేశాడు. చెల్లెలు బిగ్గరగా అరుస్తుండటంతో మిగతా పోకిరీలు చెల్లిని మౌనంగా ఉండమని బెదిరించారు.వైద్య పరీక్షల్లో బాలికపై అత్యాచారం జరిగినట్లు నిర్ధారించారు.

Also Read: Chandrababu Lunch Break : లంచ్ బ్రేక్ దాకా చంద్రబాబుకు సీఐడీ వేసిన ప్రశ్నలు అవేనా !?

Exit mobile version