Site icon HashtagU Telugu

Unstoppable: మెగా-నందమూరి ఫాన్స్‌ రెడీగా ఉండాలమ్మా.. రామ్‌ చరణ్‌ వచ్చేస్తున్నాడు..!

Unstoppable

Unstoppable

Unstoppable: నందమూరి బాలకృష్ణ హోస్ట్‌గా వ్యవహరిస్తున్న టాక్ షో “అన్‌స్టాపబుల్”లో సినీ ప్రపంచానికి చెందిన ప్రముఖులు సందడి చేయడం ఇటీవల సర్వత్రా చర్చలో ఉంది. సినిమాల ప్రమోషన్ల భాగంగా ఈ షోలో ప్రేక్షకులను అలరిస్తున్న వారిలో నటుడు వెంకటేశ్, దర్శకుడు అనిల్ రావిపూడి, నిర్మాత సురేశ్ బాబు వంటి వారు ఇటీవలగా పాల్గొని వారి సినిమా ప్రమోషన్ చేశారు. ఇక తాజాగా వచ్చే ఎపిసోడ్‌కు సంబంధించి ఒక భారీ అప్‌డేట్ వెలుగు చూసింది.

ఈ ఎపిసోడ్‌కు నందమూరి, మెగా అభిమానులు మరింత ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఎందుకంటే ఒకప్పుడు తెలుగు సినిమా రంగంలో మెగా ఫ్యామిలీ వర్సెస్ నందమూరి ఫ్యామిలీ అన్నట్లుగా అభిమానుల మధ్య తేడా ఉండేది. అయితే, ఇప్పుడు ఆ పరిస్థితులు పూర్తిగా మారిపోయాయి. రాజకీయంగా పవన్ కళ్యాణ్ ఆధీనంలోని జనసేన పార్టీ, తెలుగుదేశం పార్టీతో పొత్తు పెట్టుకుని కలిసి పని చేస్తుండటంతో, రెండు కుటుంబాల అభిమానులు కూడా కలిసి మెలసి ఉంటున్నారు.

Helath Tips : రాత్రిపూట పెరుగు తింటే ఏమవుతుంది..?

ఈ నేపథ్యంలో, జనవరి 10న సంక్రాంతి సందర్భంగా ప్రేక్షకుల ముందుకు రాబోయే రామ్ చరణ్ యొక్క “గేమ్ ఛేంజర్” మూవీ ప్రమోషన్లలో భాగంగా రామ్ చరణ్ “అన్‌స్టాపబుల్” షోకు విచ్చేసే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఈ విషయాన్ని “ఆహా” ఓటీటీ సంస్థ వారి అధికారిక ఎక్స్ అకౌంట్ ద్వారా ప్రకటించింది. “ఒరేయ్ చిట్టి .. బాబు వస్తున్నాడు .. రీసౌండ్ ఇండియా అంతా వినిపించేలా చేయండి” అంటూ ఒక ట్వీట్ చేసింది. దీంతో మెగా, నందమూరి అభిమానులు ఆనందంతో ఉప్పొంగిపోతున్నారు. ఇదే కాకుండా.. ‘Darling be like : Time ochesindi raaa…Bro code break cheyali manam kuda’ అంటూ పలు అప్డేట్స్‌తో మరింత ఆసక్తి పెంచుతున్నారు.

బాలకృష్ణ షోలో చాలా చనువుగా అతిథులతో మాట్లాడుతూ వారి వ్యక్తిగత జీవితాలపై ఆసక్తికరమైన విషయాలను ప్రేక్షకుల ముందుకు తీసుకువస్తూ ఉంటారు. ఈసారి కూడా రామ్ చరణ్, మెగా కుటుంబం గురించి ఏ ఆసక్తికరమైన విషయాలు బయటపెడతారో అని అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. మరొక ఆసక్తికరమైన అంశం ఏమిటంటే, ఈ ఎపిసోడ్‌లో రామ్ చరణ్ తన అర్దాంగి ఉపాసనతో పాటు “గేమ్ ఛేంజర్” సినిమా టీమ్‌లోని ఇతర సభ్యులు కూడా పాల్గొనాలని ప్రచారం జరుగుతోంది.

అంటే, ఈ ఎపిసోడ్ ఒక సంచలనమైన, ప్రత్యేకమైన క్షణంగా ప్రేక్షకులకు అనుభూతి కలిగించే అవకాశం ఉన్నట్లుగా కనిపిస్తోంది.

Weight Loss : బ్రౌన్‌ షుగర్ లేదా తేనె.. బరువు తగ్గడానికి ఏది ఎక్కువ ప్రయోజనకరం..?