Rain Alert Today : తెలంగాణలో 10 జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్.. ఏపీలో మరో 4 రోజులు వర్షాలు

Rain Alert Today : తెలంగాణపై నైరుతి రుతుపవనాలు ఉధృతంగా ఉన్నాయి.

Published By: HashtagU Telugu Desk
Rain Alert Today

Rain Alert Today : తెలంగాణపై నైరుతి రుతుపవనాలు ఉధృతంగా ఉన్నాయి. వచ్చే మూడు రోజులు రాష్ట్రంలో పలుచోట్ల తేలికపాటి నుంచి మోస్తరు  వర్షాలు  కురిసే ఛాన్స్ ఉంది.  ఈరోజు, రేపు భారీ నుంచి అతి భారీ  వర్షాలు  అక్కడక్కడ  కురిసే అవకాశాలు ఉన్నాయి. ఇక ఈరోజు తెలంగాణలో ఉరుములు మెరుపులు, ఈదురుగాలులతో గంటకు 50 కి.మీ వేగంతో గాలి వీచే అవకాశం ఉందని  హైదరాబాద్ వాతావరణ అధికారులు తెలిపారు. ఇవాళ వరంగల్, హన్మకొండ, జనగామ, సిద్దిపేట, యాదాద్రి భువనగిరి, రంగారెడ్డి, వికారాబాద్, సంగారెడ్డి, మెదక్, నారాయణపేట జిల్లాల్లో అక్కడక్కడ భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. ఈ మేరకు ఆరెంజ్ అలర్ట్ లు జారీ చేశారు.

Also read : Earthquakes: మణిపూర్‌, జైపూర్‌లో భూకంపం.. భయంతో పరుగులు తీసిన జనం..!

హైదరాబాద్ లో ఈరోజు తేలికపాటి వర్షం 

‘హైదరాబాద్ లో ఆకాశం పాక్షికంగా మేఘావృతమై ఉంటుంది. సాయంత్రం లేదా రాత్రి సమయంలో తేలికపాటి నుంచి మోస్తరు వర్షం లేదా చినుకులు పడే అవకాశం ఉంది. గరిష్ఠ, కనిష్ఠ ఉష్ణోగ్రతలు వరుసగా 25 డిగ్రీలు, 22 డిగ్రీలుగా ఉండే అవకాశం ఉంది. ఉపరితల గాలులు నైరుతి దిశ నుంచి గంటకు 12 నుంచి 16 కిలో మీటర్ల వేగంతో వీచే అవకాశం ఉంది’’ అని వెదర్ బులెటిన్ లో పేర్కొ్న్నారు.

Also read : PM Modi-353 : 10 రోజులు..353 మంది ఎన్డీఏ ఎంపీలు.. భేటీ కానున్న ప్రధాని మోడీ

ఏపీలో మరో నాలుగురోజులు తేలికపాటి వర్షాలు 

ఏపీలో మరో నాలుగు రోజులు వర్షాలు కురుస్తాయని భారత వాతావరణ విభాగం (ఐఎండీ) ప్రకటించింది. దక్షిణ తెలంగాణలోని మహబూబ్ నగర్ – నాగర్ కర్నూలు మీదుగా దూసుకొస్తున్న వర్షాలు ఇవాళ  నేరుగా కర్నూలు జిల్లాలోకి ప్రవేశించనున్నాయి. ఈరోజు రాత్రి నుంచి రేపు ఉదయం వరకు కర్నూలు, నంద్యాల జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు పడొచ్చు. ఏపీకి ఎగువన ఉన్న రాష్ట్రాల్లో భారీవర్షాల వల్ల స్వల్పంగా గోదావరి వరద ఉధృతి పెరుగుతుందని విపత్తుల నిర్వహణ సంస్థ అధికారులు చెప్పారు. ముందస్తుగా ప్రభావిత జిల్లాల యంత్రాంగం అప్రమత్తం ఉండాలని సూచించారు. ముందస్తు సహాయక చర్యలకు అల్లూరి జిల్లాకు ఎన్డీఆర్ఎఫ్ టీమ్, ఏలూరు జిల్లాకు రెండు ఎస్డీఆర్ఎఫ్ బృందాలు చేరుకున్నాయని వివరించారు. అత్యవసర సహయం కోసం స్టేట్ కంట్రోల్ రూమ్ నెంబర్లు 1070, 18004250101  అందుబాటులో ఉంటాయన్నారు.లోతట్టు ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండి తగిన జాగ్రత్తలు తీసుకోవాలని, బోట్లు, మోటర్ బోట్లు, స్టీమర్లలతో నదిలో ప్రయాణించడం చేయరాదని సూచించారు. వరద నీటిలో ఈతకు వెళ్ళడం, చేపలు పట్టడం లాంటివి చేయరాదని హెచ్చరించారు.

Also read : Uniform Civil Code : యూసీసీపై కేంద్రం కీలక ప్రకటన.. విధివిధానాల ప్రశ్నే తలెత్తదని వెల్లడి

  Last Updated: 21 Jul 2023, 07:50 AM IST