Mizoram Fire Accident : మిజోరాంలో ఘోర ప్ర‌మాదం.. రోడ్డుపై పేలిన పెట్రోల్ ట్యాంక‌ర్‌

మిజోరాంలోని ఐజ్వాల్‌లో ఘోర ప్ర‌మాదం జ‌రిగింది. పెట్రోలు తీసుకెళ్తున్న ట్యాంకర్ పేలడంతో నలుగురు మరణించగా, మరో 10...

Published By: HashtagU Telugu Desk
4 killed In Fire

Fire

మిజోరాంలోని ఐజ్వాల్‌లో ఘోర ప్ర‌మాదం జ‌రిగింది. పెట్రోలు తీసుకెళ్తున్న ట్యాంకర్ పేలడంతో నలుగురు మరణించగా, మరో 10 మంది గాయపడ్డారు. ఈ ప్ర‌మాదంలో గాయ‌ప‌డిన వారిని సమీపంలోని ఆసుపత్రికి తరలించి ప్రస్తుతం చికిత్స అందిస్తున్నారు. ఐజ్వాల్‌లోని తుయిరియాల్‌లో పెట్రోలు తీసుకెళ్తున్న ట్యాంకర్‌లో మంటలు చెలరేగడంతో నలుగురు మరణించారని, 10 మంది గాయపడ్డారని ఎస్పీ సి లాల్రుయా తెలిపారు. ఈ ఘటనలో నాలుగు చక్రాల ట్యాక్సీ, రెండు ద్విచక్ర వాహనాలు ధ్వంసమయ్యాయ‌ని… వాహనాలను ఢీకొట్టిన తర్వాత ట్యాంకర్ పేలిందా లేదా మంటల్లో ఉన్న ట్యాంకర్‌ను వాహనాలు ఢీకొట్టిందా అనేది ఇంకా తెలియాల్సి ఉందన్నారు.

  Last Updated: 30 Oct 2022, 08:52 AM IST