Petrol Diesel Price Today: నేటి పెట్రోల్, డీజిల్ కొత్త ధరలివే.. హైదరాబాద్ లో లీటరు ధర ఎంతంటే..?

ముడిచమురు ధరలో హెచ్చుతగ్గుల మధ్య పెట్రోల్, డీజిల్ తాజా ధరల (Petrol Diesel Prices)ను చమురు కంపెనీలు బుధవారం ఉదయం 6 గంటలకు అప్‌డేట్ చేశాయి. పెట్రోలు, డీజిల్ ధరల (Petrol Diesel Prices)పై సడలింపు కొనసాగుతోంది.

Published By: HashtagU Telugu Desk
Centre's sensational decision on petrol 30% excise duty waiver.

Centre's sensational decision on petrol 30% excise duty waiver.

ముడిచమురు ధరలో హెచ్చుతగ్గుల మధ్య పెట్రోల్, డీజిల్ తాజా ధరల (Petrol Diesel Prices)ను చమురు కంపెనీలు బుధవారం ఉదయం 6 గంటలకు అప్‌డేట్ చేశాయి. పెట్రోలు, డీజిల్ ధరల (Petrol Diesel Prices)పై సడలింపు కొనసాగుతోంది. ఢిల్లీ, ముంబై, కోల్‌కతా, చెన్నైలలో పెట్రోల్, డీజిల్ ధరలు యథాతథంగా కొనసాగుతున్నాయి. గత ఏడాది కాలంగా పెట్రోల్, డీజిల్ ధరల్లో ఎలాంటి మార్పు లేదు. ముడి చమురు ధర బ్యారెల్‌కు దాదాపు 75 డాలర్లు. బెంచ్‌మార్క్ బ్రెంట్ క్రూడ్ బ్యారెల్‌కు $0.40 లేదా 0.53 శాతం తగ్గి $74.51 వద్ద ఉండగా, WTI క్రూడ్ $0.40 లేదా 0.56 శాతం తగ్గి బ్యారెల్ $70.46 వద్ద ఉంది.

ఢిల్లీ, ముంబై, కోల్‌కతా, చెన్నైనగరాలలో పెట్రోల్-డీజిల్ ధరలు

– ఢిల్లీలో లీటర్ పెట్రోల్ రూ.96.72, డీజిల్ రూ.89.62
– కోల్‌కతాలో లీటరు పెట్రోలు రూ. 106.03, డీజిల్ రూ. 92.76
– ముంబైలో లీటర్ పెట్రోల్ రూ.106.31, డీజిల్ రూ.94.27
– చెన్నైలో లీటర్ పెట్రోల్ రూ.102.63, డీజిల్ రూ.94.24

Also Read: Gold Price Today: బంగారం కొనాలనుకుంటున్నారా.. అయితే నిన్నటితో పోలిస్తే ధరలు ఎలా ఉన్నాయంటే..?

ఇతర నగరాల్లో పెట్రోల్, డీజిల్ ధరలు

పాట్నాలో లీటర్ పెట్రోల్ రూ.107.24, డీజిల్ రూ.94.04
జైపూర్ లో లీటర్ పెట్రోల్ రూ. 108.48, డీజిల్ రూ. 93.72
లక్నోలో లీటర్ పెట్రోల్ రూ. 96.62, డీజిల్ రూ. 89.81
హైదరాబాద్ లో లీటరు పెట్రోలు రూ.109.66, డీజిల్ రూ.97.82
చండీగఢ్ లో లీటర్ పెట్రోల్ రూ.96.20, డీజిల్ రూ.84.26
బెంగళూరులో లీటర్ పెట్రోల్ రూ.101.94, డీజిల్ రూ.87.89

Also Read: Southwest Monsoons: తెలుగు రాష్టాల్లో నైరుతి రుతుపవనాల రాక ఎప్పుడంటే?

రేట్లు ప్రతిరోజూ విడుదలవుతాయి

ముడి చమురు ధర ఆధారంగా పెట్రోల్, డీజిల్ ధరలను ప్రభుత్వ చమురు కంపెనీలు ప్రతిరోజూ ఉదయం 6 గంటలకు జారీ చేస్తాయి. మీరు SMS ద్వారా మీ సమీపంలోని పెట్రోల్ పంపులో పెట్రోల్, డీజిల్ ధరలను సులభంగా తెలుసుకోవచ్చు. ఇండియన్ ఆయిల్ వెబ్‌సైట్ ప్రకారం.. దీని కోసం మీరు RSP డీలర్ కోడ్‌ని 92249 92249కి SMS చేయాలి.

  Last Updated: 17 May 2023, 08:02 AM IST