Makar Sankranti Affect: సంక్రాంతి పండుగ సందర్భంగా స్వగ్రామాలకు వెళ్లే ప్రజల కోసం తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ ప్రత్యేక బస్సులను ఏర్పాటు చేసింది. సంక్రాంతి పండుగ సందర్భంగా నిన్న శనివారం తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ బస్సుల్లో 52 లక్షల మంది ప్రయాణికులు ప్రయాణించారు. ఈ వారం ప్రారంభంలో టీఎస్‌ఆర్‌టీసీ (TSRTC) సంక్రాంతి పండుగ సీజన్‌ల ప్రయాణించే ప్రయాణికుల కోసం జనవరి 7 నుండి 15 వరకు 4,484 ప్రత్యేక బస్సులను నడుపుతున్నట్లు ప్రకటించింది.
ఆదివారం, ఆర్టీసీ 652 ప్రత్యేక బస్సులను ప్లాన్ చేసి, మధ్యాహ్నం నాటికి 450 బస్సులను నడిపినట్లు టీఎస్‌ఆర్‌టీసీ మేనేజింగ్ డైరెక్టర్ సజ్జనార్ మీడియాకు తెలిపారు. అందులో 1127 హైదరాబాద్ నగర బస్సులను ప్రయాణికుల రద్దీ ఎక్కువగా ఉన్న కరీంనగర్, వరంగల్, విజయవాడ, ఖమ్మం రూట్లలో నడిపామన్నారు.
50% మంది మహిళలు మహాలక్ష్మి పథకాన్ని వినియోగించుకున్నారని ప్రజా రవాణా సంస్థ తెలిపింది. మహాలక్ష్మి పథకాన్ని వినియోగించుకుని ఉచితంగా వారంతా సొంతూళ్లకు వెళ్లారు. ముందస్తు ప్రణాళికతో పాటు సిబ్బంది సమన్వయంతో పనిచేయడం వల్ల సంక్రాంతికి ఎలాంటి ఘటనలు జరగకుండా ప్రశాంతంగా ప్రయాణికులను తమ సొంతూళ్లకు సంస్థ చేర్చిందన్నారు. యాణికులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా టీఎస్ఆర్టీసీ పకడ్బందీ ఏర్పాట్లు చేసింది. అలాగే రద్దీకి అనుగుణంగా ప్రత్యేక బస్సులను ప్రయాణికులకు అందుబాటులో ఉంచుతున్నారు.
Also Read: Telangana: కాంగ్రెస్ సర్కారును కూల్చేందుకు KCR భారీ కుట్ర