మామూలుగా అద్దె ఇంట్లో ఉంటున్నప్పుడు లేదా ఏదైనా అపార్ట్మెంట్ లో నివసిస్తున్నప్పుడు కొన్ని రకాల కండిషన్స్ అన్నవి తప్పనిసరి. ఆ కండిషన్స్ కు ఒప్పుకున్న తర్వాతే ఇల్లు అద్దెకు ఇవ్వడానికి ఇష్టపడుతూ ఉంటారు. అలా ఒక అపార్ట్మెంట్ లో వింటర్ రూల్స్ ని పెట్టారు. చాలామంది ఆ వింత రూల్స్ చూసి షాక్ అవుతున్నారు. అసలు ఆ వింత రూల్స్ ఏంటి? ఆ అపార్ట్మెంట్ ఎక్కడ ఉంది అన్న విషయాల గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం.. గ్రేటర్ నోయిడా లోని ఒక అపార్ట్మెంట్ తీసుకువచ్చిన డ్రెస్ కోడ్ రూల్స్ వివాదాస్పదంగా మారాయి.
బహిరంగ ప్రదేశాలలో పార్కింగ్ ఏరియాలలో లుంగీలు కట్టుకొని నైటీలు ధరించి తిరగవద్దు అని రూల్స్ జారీ చేశారు. ఆ అపార్ట్మెంట్ ఏరియా గ్రేటర్ నోయిడా లోని సెక్టర్ 2 లో ఉంది. దీని రెసిడెన్స్ వెల్ఫేర్ అసోసియేషన్ జూన్ 10న జారీ చేసిన సర్కులర్ ప్రస్తుతం వైరల్ అవుతోంది. ఈ నిర్ణయంపై నెటిజన్స్ నుంచి మిశ్రమ స్పందన లభిస్తోంది. కొందరు నెటిజన్స్ ఈ విషయంపై స్ప ఈ దుస్తులు ధరించడం వారి వ్యక్తిగతం అంటూ కామెంట్ చేస్తున్నారు. సమాజంలో మీరు తిరిగే ప్రతిసారి మీ ప్రవర్తన వేషధారణ పై మీరందరూ ప్రత్యేక శబ్ద వహించాలని భావిస్తున్నారు. మీ ప్రవర్తన పై ఎవరికి అభ్యంతరం చెప్పే అవకాశం ఇవ్వకండి. మీ పిల్లలు కూడా మీ నుంచి నేర్చుకుంటారు.
నైటీ లుంగీలను కేవలం ఇంట్లో ధరించండి. ఫ్లాట్ వెలుపల వాటిని ధరించకూడదని ప్రతి ఒక్కరిని అభ్యర్థిస్తున్నాను అని హింసా నగర్ అపార్ట్మెంట్ కార్యదర్శి హరి ప్రకాష్ నోటీసు జారీ చేశారు. సొసైటీ కి చెందిన కొంతమంది నుంచి ఫిర్యాదులు అందాయని అందుకే ఇటువంటి నిర్ణయం తీసుకున్నారని ఆయన తెలిపారు. అపార్ట్మెంట్ పరిసర ప్రాంతాల్లో కొందరు వదులుగా ఉండే దుస్తులు ధరించి నిత్యం యోగా చేస్తున్నారని, వాటిపై ఫిర్యాదులు వచ్చినందుకు ఎటువంటి నిర్ణయం తీసుకున్నామని హరి ప్రకాష్ తెలిపారు
