Sharad Pawar Skip : తొలిరోజు విపక్షాల మీటింగ్ కు శరద్ పవార్ దూరం

Sharad Pawar Skip : కర్ణాటక రాజధాని బెంగళూరు వేదికగా 26 విపక్ష పార్టీల మీటింగ్ వేళ ఒక కీలక వార్త తెరపైకి వచ్చింది.

Published By: HashtagU Telugu Desk
Sharad Pawar Vs Ajit pawar

Sharad Pawar Skip : కర్ణాటక రాజధాని బెంగళూరు వేదికగా 26 విపక్ష పార్టీల మీటింగ్ వేళ ఒక కీలక వార్త తెరపైకి వచ్చింది.

విపక్ష కూటమి కన్వీనర్ పదవి రేసులో ఉన్న నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ (ఎన్సీపీ)  చీఫ్ శరద్ పవార్.. ఇవాళ (సోమవారం) జరిగే తొలిరోజు సమావేశానికి హాజరుకావడం  లేదని తెలిసింది.

ఆయన కుమార్తె, ఎన్సీపీ వర్కింగ్ ప్రెసిడెంట్  సుప్రియా సూలే కూడా తొలిరోజు మీటింగ్ కు(Sharad Pawar Skip) రావడం లేదు.

అయితే  రెండో రోజు(మంగళవారం) జరిగే మీటింగ్ కు వస్తామని వారిద్దరూ వెల్లడించారు.    

శరద్ పవార్ పై తిరుగుబాటు చేసి మహారాష్ట్ర డిప్యూటీ సీఎం అయిన అజిత్ పవార్ మరో 9 మంది సీనియర్ నేతలతో కలిసి ఆదివారం ఉదయం ఎన్సీపీ చీఫ్ ను ఆఫీసుకు వెళ్లి కలిశారు. ఎన్సీపీని ముక్కలు చేయొద్దని.. ఒక్క పార్టీగానే ఉంచాలని శరద్ పవార్ కు వాళ్ళు రిక్వెస్ట్ చేశారు. “శరద్ పవార్ మా నాయకుడు.. ఆయనే మా దేవుడు.. ఆయన ఆశీర్వాదం తీసుకోవడానికి వచ్చాము” అని శరద్ పవార్ తో భేటీ అనంతరం ఎన్సీపీ తిరుగుబాటు నేత ప్రఫుల్ పటేల్ మీడియాకు చెప్పారు.

Also read : Vande Bharat Fire: భోపాల్ నుంచి ఢిల్లీ వెళ్తున్న వందేభారత్ రైలులో మంటలు.. ప్రయాణికులు సురక్షితం

బెంగళూరులో విపక్షాల మీటింగ్ జరగడానికి సరిగ్గా ఒకరోజు ముందు వాళ్ళు వచ్చి శరద్ పవార్ ను కలవడం.. తొలి రోజు విపక్షాల మీటింగ్ కు హాజరు కాలేనని శరద్ పవార్ ప్రకటన చేయడం రాజకీయ ప్రాధాన్యాన్ని సంతరించుకుంది. తనపై తిరుగుబాటు చేసిన ఎమ్మెల్యేలతో మీటింగ్ కు సమయం కేటాయించిన శరద్ పవార్.. తనకు అండగా మాట్లాడిన విపక్షాల మీటింగ్ కు సమయాన్ని ఎందుకు కేటాయించలేదనే దానిపై ఇప్పుడు డిబేట్ నడుస్తోంది.

Also read : Murder : ప్ర‌భుత్వ ఉపాధ్యాయుడు దారుణ హ‌త్య‌.. న‌లుగురు అరెస్ట్‌

  Last Updated: 17 Jul 2023, 10:24 AM IST