PM Modi: దేశవ్యాప్తంగా నవరాత్రి ఉత్సవాలు, మోడీ ప్రత్యేక పూజలు

  • Written By:
  • Publish Date - October 17, 2023 / 05:45 PM IST

PM Modi: దేశవ్యాప్తంగా నవరాత్రి ఉత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. ప్రతిచోట అమ్మవారిని వివిధ అలంకారాల్లో భక్తులు ఆరాధిస్తున్నారు. ఉత్తర, పశ్చిమ భారతంలోని పలుచోట్ల అమ్మవారు ఈ రోజు చంద్రఘంట మాత అలంకారంలో దర్శనమిస్తున్నారు. ఈ సందర్భంగా ప్రధానమంత్రి నరేంద్రమోదీ.. చంద్రఘంట మాతకు ప్రత్యేక పూజలు నిర్వహించారు. అమ్మవారి ఆశిస్సులతో దేశ ప్రజల కీర్తి మరింతగా పెరగాలని ప్రధాని ప్రార్ధనలు నిర్వహించారు. ఈ సందర్భంగా సామాజిక మాధ్యమం ఎక్స్ లో ఓ చంద్రఘంటా మాతా ప్రార్ధనా గీతాన్ని మోదీ పంచుకున్నారు.