నిన్నటి నుండి యావత్ ప్రజానీకం అంత చంద్రబాబు అరెస్ట్ (Chandrababu arrest) గురించే మాట్లాడుకుంటున్నారు. చంద్రబాబు కు సంబంధం లేని కేసులో ఆయన్ను ఇరికించడం..విచారణ పేరుతో CID దాదాపుగా 30 గంటలగా ఇబ్బందికి గురిచేస్తుండడం ప్రజలు తట్టుకోలేకపోతున్నారు. కనీసం కాసేపైనా ఆయన్ను రెస్ట్ తీసుకోకుండా..అటు ఇటు తిప్పుతూ..నరకం చూపిస్తున్నారు వారంతా వాపోతున్నారు. సాధారణంగా ఎన్నికలు వస్తున్నాయంటే..అధికార పార్టీ..ప్రతిపక్ష పార్టీల నేతలఫై కేసులు పెట్టడం..వారిని అరెస్ట్ చేయించడం చేస్తుంది. చంద్రబాబు విషయంలో మాత్రం జగన్ సర్కార్ కక్ష్య సాధింపు చర్య చేస్తుంది. ఆయనకు అసలు సంబంధం లేని..ఎఫ్ఐఆర్ లో ఆయన పేరు కూడా లేని కేసులో ఆయన్ను అరెస్ట్ చేయించింది. అంతే కాదు ఈ కేసులో నారా లోకేష్ ను కూడా చేర్చి జైలు పంపించాలని చూస్తుంది. ప్రభుత్వం ఎన్ని కక్ష్య సాధింపు చర్యలు చేపట్టిన చివరకు ధర్మమే గెలుస్తుందని చంద్రబాబు ధీమా గా ఉన్నారు. ప్రస్తుతం CID కోర్ట్ లో విచారణ జరుగుతుంది.
Read Also : Section 49 – Chandrababu Bail : చంద్రబాబు బెయిల్ పిటిషన్.. సెక్షన్ 409పై వాదనలు.. ఏమిటిది ?
ఇదిలా ఉంటె CBI కోర్ట్ లో చంద్రబాబు ను చూసి ఆయన సతీమణి భువనేశ్వరి (Nara Bhuvaneswari ) ఎమోషనల్ అయ్యారు. ఇదే క్రమంలో ప్రజాక్షేత్రంలోకి నారా భువనేశ్వరి, బ్రాహ్మణి (Nara Brahmani)లు వెళ్లే ఆలోచనలో ఉన్నట్లు తెలుస్తుంది. రాష్ట్రం కోసం, ప్రజల కోసం కష్టపడుతున్న చంద్రబాబు, లోకేష్‌లపై వేధింపులకు పాల్పడుతున్నారని.. తప్పుడు కేసులో వేధిస్తున్నారని న్యాయం మీరే చెప్పాలని వారు ప్రజల వద్దకు వెళ్లే ఆలోచన చేస్తున్నట్లుగా సమాచారం. ఈ అంశంపై టీడీపీ సినీ నేతలు ఇప్పటికే ఓ కార్యాచరణ సిద్ధం చేసే పనిలో ఉన్నట్లు తెలుస్తుంది. నారా లోకేష్ పైనా సీఐడీ చీఫ్ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ఆయనను కూడా అరెస్ట్ చేస్తామని పరోక్షంగా చెప్పారు. ఒక వేళ అదే జరిగితే పాదయాత్ర ఆపేయాల్సి ఉంటుంది. అందుకే.. వెంటనే.. విరుగుడుగా.. భువనేశ్వరి, బ్రాహ్మణిలు పార్టీ తరపున రంగంలోకి దిగి.. లోకేష్ ఆపేసిన దగ్గర్నుంచి పాదయాత్ర చేయడం చేయాలనే ఆలోచనలో ఉన్నారట.
రాజకీయాల్లో సానుభూతి మించిన అస్త్రం మరోటి లేదు. ఈ సానుభూతి తోనే వైస్ రాజశేఖర్ రెడ్డి , ఆయన కుమారుడు జగన్ మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చారు. వైఎస్ చనిపోయిన తర్వాత సానుభూతి అస్త్రం తో జగన్ ప్రజల్లోకి వెళ్లారు. ఉపఎన్నికల్లో భారీ విజయాలు సాధించారు. ఆదిలాబాద్ నుంచి చిత్తూరు వరకూ ఆ సానుభూతి వేవ్ కనిపించింది. గత ఎన్నికల్లోనూ ఆయన ఒక్క చాన్స్ అని ప్రజలను వేడుకున్నారు. ప్రజల్లో టిడిపికి వ్యతిరేకత లేనప్పటికీ జగన్ ఫై సానుభూతి తో ప్రజలు ఆయనకు ఓటువేసి గెలించారు. జగన్ 16 నెలలు జైల్లో ఉన్నప్పుడు..ఆయన తల్లి విజయమ్మ , సోదరి షర్మిల పార్టీ పగ్గాలు పట్టుకొని రాష్ట్ర వ్యాప్తంగా పాదయాత్ర చేసి జగన్ గెలుపు కోసం పోరాటాం చేసారు. ఈ సానుభూతి కూడా జగన్ గెలుపుకు కారణమైంది.ముఖ్యంగా మహిళల్లో సానుభూతి పవనాలు వీస్తే ఫలితాలు పూర్తి స్థాయిలో ఏకపక్షమవుతాయన్న అంచనాలు ఉన్నాయి.
Read Also : TDP Leaders – House Arrests : బాబుకు బెయిల్ పై హైటెన్షన్.. టీడీపీ నేతల హౌస్ అరెస్టులు
రాజకీయాల్లో ప్రజలు ఎప్పటికి ఒకే వ్యక్తికి పట్టం కట్టారు. ఓటు వేసి గెలిపించిన ప్రభుత్వం దుర్వినియోగం చేస్తున్నారని అనిపిస్తే.. ప్రజలు మరోసారి అధికారం అప్పగించడానికి సంశయిస్తారు. వేధింపులకు గురైన వారికి బాసటగా నిలుస్తారు. ఇది ఈరోజుది కాదు అనాదిగా వస్తున్న రాజకీయం. అయితే కక్ష సాధింపు రాజకీయాలు ఎప్పుడూ ఉమ్మడి రాష్ట్రంలో ఎన్నికల ఎజెండా కాలేదు. తమిళనాడు వంటి రాష్ట్రాల్లో ఉండేది. ఇప్పుడు ఏపీలో ఆ తరహా రాజకీయాలు వచ్చాయి. అందుకే ఏపీ రాజకీయాల్లో రానున్న రోజుల్లో కీలక మార్పులు ఖాయమన్న అంచనాలు గట్టిగా వినిపిస్తున్నాయి. చంద్రబాబు ను అరెస్ట్ చేసి వైసీపీ సంబరాలు చేసుకుంటుంది కానీ ప్రజలు మాత్రం జగన్ కు ఓటు వేసి తప్పు చేశామని..మరోసారి ఆ తప్పు చేయకూడదని ఫిక్స్ అవుతున్నారు. ఇది జగన్ ఆలోచించకుండా తప్పు మీద తప్పు చేస్తున్నాడు.