నిబంధనలు అతిక్రమించి వాహనాలు నడిపే వారిపై ట్రాఫిక్ పోలీసులు (Traffic Police) కొరడా ఝుళిపిస్తున్నా కొందరు వాహనదారుల్లో మార్పు రావడం లేదు. రద్దీ రోడ్లపై సైతం నిబంధనలకు విరుద్దంగా ప్రయాణం సాగిస్తున్నారు. ముబైలో ఇటీవల ఇలాంటి ఘటన ఒకటి చోటు చేసుకుంది. వాహనదారుడు స్కూటీపై ముగ్గురు, నలుగురు కాదు.. ఏకంగా ఏడుగురిని ఎక్కించుకొని ప్రయాణం చేస్తున్నాడు. ఈ దృశ్యాన్ని తోటి వాహనదారుల్లో ఒకరు వీడియో తీసి ట్విటర్‌లో షేర్ చేశాడు. అదికాస్త పోలీసుల దృష్టికి చేరడంతో ముంబై ట్రాఫిక్ పోలీసులు సదరు వాహనదారుడిని గుర్తించి చర్యలు తీసుకున్నారు.
ఒకే స్కూటర్‌పై ఏడుగురు పిల్లలతో ప్రయాణం చేస్తున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఈ వీడియోను చూసి నెటిజన్లు షాకవుతున్నారు. ముంబై ట్రాఫిక్ పోలీసులు మోటార్ బైక్ నెంబర్ ఆధారంగా వాహనదారుడు మునవ్వర్ షాగా గుర్తించారు. వీడియోలో కనిపించేదానిని బట్టి.. మునవ్వర్ షా ఇద్దరు పిల్లలను ముందు నిల్చోబెట్టాడు. మరో ముగ్గురు వెనుకాల సీటుపై కూర్చోబెట్టాడు. మరొకరు స్కూటీ వెనుకాల నిలబడి ఉన్నట్లు వీడియోలో చూడవచ్చు. అయితే.. ఏడుగురి పిల్లల్లో నలుగురు మునవ్వర్ షా పిల్లలు కాగా, మిగిలిన వారు పొరుగువారి పిల్లలు.
మునవ్వర్ షా కొబ్బరికాయల దుకాణం నడుపుతున్నాడు. సోషల్ మీడియాలో వీడియో వైరల్ కావడంతో మునవ్వర్ షాను ముంబై పోలీసులు అరెస్టు చేశారు. ముంబై ట్రాఫిక్ పోలీసులు నిబంధనలు అతిక్రమించిన వాహనదారులపై కఠిన చర్యలు తీసుకుంటున్నా.. మునవ్వర్ షా లాంటివారిలో మార్పురాకపోవటం పట్ల నెటిజన్లు మండిపడుతున్నారు.
This is probably not the safest way to drive children:
man in Mumbai rides scooter with 7 children, arrested.#India #मुंबई pic.twitter.com/EAapEJtfKk
— WORLD X MONITOR (@worldXmonitor) June 27, 2023
Forest Area Lost : ప్రపంచ వ్యాప్తంగా ఒక్క నిమిషానికి ఎంత శాతం అడవిని కోల్పోతున్నామో తెలుసా?