MLC Kavitha: చంద్రబాబు సభపై ఎమ్మెల్సీ కవిత కామెంట్స్!

బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత (MLC Kavitha) టీడీపీ అధినేత చంద్రబాబుపై మండిపడ్డారు.

Published By: HashtagU Telugu Desk
Mlc Kavitha, chandrababu

Mlc Kavitha

టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు (Chandrababu) ఖమ్మం వేదికగా భారీ బహిరంగ సభ పెట్టిన విషయం తెలిసిందే. తెలంగాణ ప్రజలనుద్దేశించి ఆయన కీలక విషయాలపై మాట్లాడారు. టీడీపీ (TDP) హాయాంలోనే తెలంగాణ డెవలప్ అయ్యిందని చంద్రబాబు వ్యాఖ్యానించారు. తెలంగాణ‌లో తెలుగుదేశం పార్టీని బ‌తికించుకోవాల‌ని ఇంకా ఆరాట‌ప‌డుతున్న ఆ పార్టీ అధినేత చంద్ర‌బాబు చేస్తున్న వ్యాఖ్య‌లు తెలంగాణ నేతలకు కోపం తెప్పించినట్టయింది. చంద్రబాబు తీరుపై  బీఆర్ఎస్ నేతలు (BRS Leaders) ఘాటుగా రియాక్ట్ అయ్యారు.

బిఆర్ఎస్ ఎమ్మెల్సీ క‌ల్వ‌కుంట్ల క‌విత (MLC Kavitha) స్పందించారు. తెలంగాణ‌ రాష్ట్రంలో తెలుగుదేశం రాజ‌కీయాలు చెల్ల‌బోవ‌ని అన్నారు. మ‌ళ్ళీ రాష్ట్రంలో టిడిపిని రుద్దాల‌ని ప్ర‌య‌త్నిస్తున్నార‌ని ఎద్దేవా చేశారు. . అయితే ఇప్ప‌టికే తెలంగాణ‌ (Telangana) ప్ర‌జ‌లు ఆపార్టీని నిర్ద్వందంగా తిర‌స్క‌రించార‌ని అన్నారు. ఇక్క‌డ మూటా ముల్లె స‌ర్దుకుపోయిన త‌ర్వాత మ‌ళ్ళీ ఇక్క‌డ‌కొచ్చి రాజ‌కీయాలు చేస్తామంటే ప్ర‌జ‌లు అంగీక‌రించ‌ర‌న్నారు. ఆకాశంలో చుక్క‌లు ఎన్ని ఉన్నా చంద్రుడు ఒక్క‌డే అన్న చందంగా తెలంగాణ లో ముఖ్య‌మంత్రి కెసిఆర్ (CM KCR) ఒక్క‌రేన‌ని బిఆర్ఎస్ ఎమ్మెల్సీ క‌విత పేర్కొన్నారు.

Also Read: Digvijay Singh: సీనియర్స్ తో ‘డిగ్గీ’ మంతనాలు.. కాంగ్రెస్ సంక్షోంభంపై వరుస భేటీలు!

  Last Updated: 22 Dec 2022, 05:53 PM IST