BRS Minister: పాలకుర్తిలో జోరుగా ఎర్రబెల్లి ప్రచారం, పలువురు బీఆర్ఎస్ లో చేరిక

రోజు రోజుకూ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు కి ప్రజల మద్దతు పెరుగుతున్నది.

  • Written By:
  • Publish Date - November 7, 2023 / 05:27 PM IST

BRS Minister: రోజు రోజుకూ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు కి ప్రజల మద్దతు పెరుగుతున్నది. వివిధ వర్గాలు, సామాజిక సంఘాలు, ఆయనకు మద్దతుగా నిలుస్తున్నాయి. వివిధ పార్టీలు, సామాజిక వర్గాలకు చెందిన అనేక మంది బిఅర్ఎస్ లో చేరితుండగా, మరికొందరు తమ మద్దతు తెలుపుతూ మంత్రిని కలుస్తున్నారు. తాజా గా కొడకండ్ల మండలం రామన్నగూడెం కి చెందిన కృష్ణ గొర్రెల పెంపకం దారుల సంఘం కు చెందిన 41 కుటుంబాల యాదవ సంఘం కార్యవర్గం, సభ్యులు ఎర్రబెల్లి దయాకర్ రావు కి మద్దతు తెలిపారు.

పాలకుర్తి కి చెందిన మాదిగ సామాజిక వర్గ నాయకుడు ఎడవల్లి పెద్ద సోమయ్య ఈ రోజు మంత్రి ఎర్రబెల్లి ని పాలకుర్తి బి అర్ ఎస్ పార్టీ కార్యాలయంలో కలిసి, ఆ పార్టీ లో చేరారు. అలాగే పాలకుర్తి మండల బీజేపీ యూత్ అధ్యక్షుడు, రాఘవాపురం గ్రామానికి చెందిన పూజారి మహేష్ మంత్రి దయన్న సమక్షంలో బి అర్ ఎస్ లో చేరారు.

కాగా రాయపర్తి మండలం కొలన్ పల్లికి చెందిన వివిధ పార్టీలకు చెందిన అనేకమంది యువకులు మంత్రి ఎర్రబెల్లి ని పాలకుర్తిలో కలిసి తమ మద్దతు తెలిపారు. పాలకుర్తి మండలం తొర్రూరు గ్రామానికి చెందిన కాంగ్రెస్ పార్టీ నాయకుడు పసులాది యాకస్వామి, పసులాది ఆంజనేయులు, రేగుల రాములు ముదిరాజ్ తదితరులు బి అర్ ఎస్ లో చేరారు.  కాగా, పాలకుర్తి మండలం చెన్నూరు గ్రామంలోని కాంగ్రెస్ నాయకులు పిట్టల పెద్ద కొండయ్య, పండుగ నర్సయ్య లు బి అర్ ఎస్ లో చేరారు.

మండల కేంద్రమైన పెద్ద వంగర కు చెందిన పలువురు మహిళలు కలిసి వచ్చి, మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావును కలిసి తమ సంపూర్ణ మద్దతు తెలిపారు. కొద్దిసేపు మంత్రితో కలిసి వాళ్లంతా గ్రామాల్లోని తాజా పరిస్థితులను వివరించారు. రోజురోజుకు మంత్రికి, బి అర్ ఎస్ పార్టీకి మద్దతు పెరుగుతున్నది అన్నారు. ప్రత్యేకించి మహిళలు అంతా మంత్రికి అండగా ఉన్నామని తెలిపారు.