jnaneswari: జ్ఞానేశ్వరి అదృశ్యం కేసులో బిగ్ ట్విస్ట్..

కాకినాడ జిల్లా తునిలో అదృశ్యమైన రెండేళ్ల చిన్నారి జ్ఞానేశ్వరి కేసులో మరో ట్విస్ట్ చోటుచేసుకుంది. సీహెచ్ అగ్రహారం గ్రామంలో ఉండే చిన్నారి జ్ఞానేశ్వరి జూన్ 6వ తేదీ నుంచి కనిపించకుండా పోయింది. పాప జాడ కనిపెట్టేందుకు పోలీసులు, ఎన్‌డీఆర్ఎఫ్ బలగాలు తీవ్రంగా గాలించాయి. సాంకేతికత సాయంతో గాలింపు చర్యలు చేపట్టారు. అయినప్పటికీ నెల రోజులు గడుస్తున్నా ఎలాంటి ఆచూకీ కనిపెట్టలేకపోయారు. పాప ఆచూకీ తెలిపిన వారికి రివార్డు ప్రకటించినప్పటికీ ఉపయోగం లేకపోయింది. ఈ నేపథ్యంలో చిన్నారి జ్ఞానేశ్వరి […]

Published By: HashtagU Telugu Desk
Major twist in the Jnaneshwari disappearance case...

Major twist in the Jnaneshwari disappearance case...

కాకినాడ జిల్లా తునిలో అదృశ్యమైన రెండేళ్ల చిన్నారి జ్ఞానేశ్వరి కేసులో మరో ట్విస్ట్ చోటుచేసుకుంది. సీహెచ్ అగ్రహారం గ్రామంలో ఉండే చిన్నారి జ్ఞానేశ్వరి జూన్ 6వ తేదీ నుంచి కనిపించకుండా పోయింది. పాప జాడ కనిపెట్టేందుకు పోలీసులు, ఎన్‌డీఆర్ఎఫ్ బలగాలు తీవ్రంగా గాలించాయి. సాంకేతికత సాయంతో గాలింపు చర్యలు చేపట్టారు. అయినప్పటికీ నెల రోజులు గడుస్తున్నా ఎలాంటి ఆచూకీ కనిపెట్టలేకపోయారు. పాప ఆచూకీ తెలిపిన వారికి రివార్డు ప్రకటించినప్పటికీ ఉపయోగం లేకపోయింది. ఈ నేపథ్యంలో చిన్నారి జ్ఞానేశ్వరి మిస్సింగ్ కేసు మరో మలుపు తిరిగింది. జ్ఞానేశ్వరి కనిపించకుండా పోయిన జూన్ ఆరో తేదీన ఒక కారు అనుమానాస్పదంగా తిరిగినట్లు తెలిసింది.

చిన్నారి అదృశ్యం కావడానికి రెండు రోజుల ముందు నుంచి ఆ కారు అనుమానాస్పదంగా తిరిగినట్లు తెలిసింది. అదే కారు.. నర్సీపట్నం సమీపంలో జ్ఞానేశ్వరి తాతను ఢీకొట్టినట్లు చిన్నారి బంధువులు చెప్తున్నారు. ఈ నేపథ్యంలో ఆ కారు, అందులోని వ్యక్తులపై అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. దీంతో పోలీసులు ఆ కోణంలోనూ దర్యాప్తు జరుపుతున్నారు. ఆ కారు ఎవరిది.. ఎక్కడి నుంచి వచ్చిందనే దానిపై పోలీసులు లోతుగా ఆరా తీస్తున్నారు. కారు గురించి వివరాలు తెలుసుకుంటే పాప ఆచూకీని కనిపెట్టడంలో కీలకంగా మారుతాయనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.

మరోవైపు చిన్నారి జ్ఞానేశ్వరి ఆచూకీ కనిపెట్టేందుకు 12 టీమ్స్ రంగంలోకి దిగాయి. వివిధ కోణాలలో దర్యాప్తు జరిపారు. ఎవరైనా కిడ్నాప్ చేశారా.. లేక క్రూరమృగాలు ఏవైనా లాక్కెళ్లాయా అనే కోణంలోనూ దర్యాప్తు జరిగింది. అయితే ఏ విషయంలోనూ పోలీసులకు ఆధారాలు లభించలేదు. పాపను ఎవరైనా ఊరి నుంచి తీసుకెళ్లిపోయారా అనే కోణంలో విచారిస్తూ.. చిన్నారి ఆచూకీ చెబితే లక్ష రూపాయలు ఇస్తామని రివార్డు కూడా ప్రకటించారు. కాకినాడ జిల్లా సహా చుట్టుపక్కల ప్రాంతాలలో పాప ఫోటోతో పోస్టర్లు అంటించారు. జ్ఞానేశ్వరి సమాచారం ఇచ్చిన వారి వివరాలను రహస్యంగా ఉంచుతామంటున్న పోలీసులు.. పాప ఆచూకీ తెలిస్తే 9440796508, 9440796531, 9440796573 ఫోన్ నంబర్లకు సమాచారం ఇవ్వాలని కోరుతున్నారు.

  Last Updated: 07 Jul 2026, 10:12 AM IST