Mangli : మంగ్లీ ఎఫ్‌ఐఆర్‌ కాపీలో కీలక విషయాలు

Mangli : హైదరాబాద్‌ శివార్లలోని త్రిపుర రిసార్ట్‌లో సింగర్ మంగ్లీ బర్త్‌డే పార్టీ సందర్భంగా జరిగిన అనుమతిలేని హంగామాపై పోలీసులు ఎఫ్‌ఐఆర్‌లో కీలక విషయాలను పేర్కొన్నారు.

Published By: HashtagU Telugu Desk
Mangli

Mangli

Mangli : హైదరాబాద్‌ శివార్లలోని త్రిపుర రిసార్ట్‌లో సింగర్ మంగ్లీ బర్త్‌డే పార్టీ సందర్భంగా జరిగిన అనుమతిలేని హంగామాపై పోలీసులు ఎఫ్‌ఐఆర్‌లో కీలక విషయాలను పేర్కొన్నారు. రాత్రి ఒంటి గంట సమయంలో భారీ శబ్ధాలు, డీజే హంగామా కొనసాగుతోందన్న స్థానికుల ఫిర్యాదు ఆధారంగా కంట్రోల్‌ రూమ్‌కు సమాచారం చేరింది.

తర్వాత మహిళా ఎస్సై సిబ్బందితో కలిసి రిసార్ట్‌కు చేరుకుని పరిస్థితిని సమీక్షించగా, అక్కడ 10 మంది మహిళలు, 12 మంది పురుషులు డీజే మ్యూజిక్‌ నడుమ మద్యం మత్తులో డాన్సులు చేస్తుండటం గుర్తించారు. అక్కడి మేనేజర్ నుంచి చేపట్టిన విచారణలో ఇది మంగ్లీ పుట్టినరోజు పార్టీ అని తెలిసింది. అయితే, ఈ పార్టీకి ఏ విధమైన అనుమతులు తీసుకోలేదని, డీజే మరియు విదేశీ మద్యం కూడా అనధికారికంగానే వినియోగించినట్లు అధికారుల విచారణలో వెల్లడైంది.

ICC T20 Rankings: ఐసీసీ టీ20 ర్యాంకింగ్స్ విడుద‌ల‌.. సూర్య‌కుమార్ యాద‌వ్‌కు బిగ్ షాక్‌!

పార్టీకి మద్యం సరఫరా చేసేందుకు ఎక్సైజ్ శాఖ నుంచి అనుమతులు పొందలేదని స్పష్టం చేయడంతోపాటు, ఈవెంట్‌ నిర్వహణ బాధ్యతలు మేఘరాజ్ అనే వ్యక్తి చూసినట్లు గుర్తించారు. డ్రగ్‌ టెస్ట్‌ నిర్వహించగా, మంగ్లీ అనుచరుడైన దామోదర్ రెడ్డి గంజాయి తీసుకున్నట్లు తేలింది. దీంతో ఆయనను అదుపులోకి తీసుకుని విచారించారు.

అంతేకాకుండా, ఎఫ్‌ఐఆర్‌లో రిసార్ట్ మేనేజ్‌మెంట్‌, మంగ్లీ సోదరుడు శివరామకృష్ణ, మంగ్లీ, ఈవెంట్ నిర్వాహకుడు మేఘరాజ్‌లపై అనుమతుల్లేకుండా పార్టీ నిర్వహించినందుకు కేసులు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు. మిగిలిన అంశాలపై కూడా విచారణ కొనసాగుతోంది.

Ntr Bharosa Pension Scheme : ఏపీలో కొత్త వితంతు పింఛన్లు మంజూరు..నెలకు రూ.4వేలు

  Last Updated: 11 Jun 2025, 05:18 PM IST