Site icon HashtagU Telugu

KTR : కావాలంటే 15 రోజులు జైలుకు పంపండి.. కేటీఆర్ కీలక వ్యాఖ్యలు

Ktr

Ktr

KTR : తెలంగాణలో ప్రస్తుతం రాజకీయంగా సంచలనం రేపుతున్న ఫార్ములా ఈ కార్ రేస్ కేసు విచారణలో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్ హాజరయ్యారు. ఈ కేసులో ఆయనకు ఏసీబీ అధికారులు సుమారు 7 గంటల పాటు విచారణ నిర్వహించారు. సమాచారం ప్రకారం, ఈ విచారణలో కేటీఆర్‌కు 60కు పైగా ప్రశ్నలు అడిగారు. విచారణ అనంతరం మరోసారి అవసరమైతే హాజరుకావాలని అధికారుల నుంచి సూచన వచ్చినట్లు తెలుస్తోంది.

విచారణ ముగిసిన తర్వాత కేటీఆర్ నేరుగా తెలంగాణ భవన్ చేరుకున్నారు. అక్కడ పార్టీ నేతలు, కార్యకర్తలతో సమావేశమయ్యారు. అనంతరం ఆయన మీడియా సమావేశంలో మాట్లాడుతూ, “ఏసీబీ అధికారులు అడిగిన ప్రశ్నల్లో నూతనమైంది ఏమీ లేదు. పదే పదే ఒకే ప్రశ్నలను తిప్పి తిప్పి అడిగారు. నేను అడిగిన కొన్ని ప్రశ్నలకు వారిదే సమాధానం ఇవ్వలేకపోయారు,” అని వ్యాఖ్యానించారు.

Matangeshwar Temple : ఏటా పెరుగుతున్న శివలింగం..ఎక్కడుందా ఆలయం? విశేషాలేంటి? తెలుసుకుందాం!

ఈ కేసును “లొట్టపీసు కేసు”గా అభివర్ణించిన కేటీఆర్, సీఎం రేవంత్‌ రెడ్డిని “లొట్టపీసు సీఎం”గా టార్గెట్ చేశారు. “మా మీద కుట్ర చేసి ఏదైనా ఒక కేసులోనైనా జైల్లో పెట్టాలన్న కక్షతోనే సీఎం ముందడుగు వేస్తున్నారు. కానీ మా వైపు నుంచి ఎలాంటి తప్పూ జరగలేదు. ఫార్ములా ఈ రేస్ తొలి ఏడాది విజయవంతం అయింది. రెండో సంవత్సరం కోసం వేదిక మారకూడదనే ఉద్దేశంతో ముందస్తు నిధులు మంజూరు చేశాం,” అని ఆయన వివరించారు.

అలాగే సీఎం రేవంత్‌ తనను జైలుకు పంపితే ఆనందించబోతున్నారంటారా? అని ప్రశ్నిస్తూ, “అయితే తెలంగాణ అభివృద్ధికి ఇంకో పది కేసులు పెట్టండి. నేను సంతోషంగా జైలుకు వెళ్లి వస్తా,” అని కేటీఆర్ అన్నారు. ఇక త్వరలో జరగబోయే స్థానిక సంస్థల ఎన్నికలపై కూడా కేటీఆర్ వ్యాఖ్యలు చేశారు. “కాంగ్రెస్‌కు ఎన్నికల్లో చుక్కలు చూపించాలి. ఇది మా పార్టీ కార్యకర్తల ప్రధాన లక్ష్యం. రాబోయే ఎన్నికల్లో బీఆర్ఎస్ బలంగా పోటీ చేస్తుంది,” అంటూ స్పష్టమైన సందేశం ఇచ్చారు.

Jr. Artist : ప్రేమ పేరుతో జూ.ఆర్టిస్ట్ ను మోసం చేసిన జిమ్ ట్రైనర్.. 15 లక్షలు స్వాహా

Exit mobile version