CM KCR: కర్ణాటక లో కరెంటు కోతలపై కేసీఆర్ కామెంట్స్

ప్రజా ఆశీర్వాద సభలో బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు, ముఖ్యమంత్రి  కేసీఆర్ ప్రసంగించారు.  

  • Written By:
  • Publish Date - October 30, 2023 / 06:17 PM IST

CM KCR: అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో భాగంగా జుక్కల్‌ బీఆర్ఎస్ అభ్యర్థి హన్మంత్ షిండే కు మద్దతుగా నిర్వహించిన ప్రజా ఆశీర్వాద సభలో బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు, ముఖ్యమంత్రి  కేసీఆర్ ప్రసంగించారు.  జుక్కల్‌ నియోజకవర్గం కర్ణాటక, మహారాష్ట్ర, తెలంగాణ ప్రాంతాలు కలిసే చోట ఉన్నదని, కర్ణాటకలో ఏం జ‌రుగుతున్నదో, మహారాష్ట్రంలో ఏం గ‌తి ఉన్నదో మీకందరికీ తెలుసని సీఎం సభకు హాజరైన ప్రజలను ఉద్దేశించి వ్యాఖ్యానించారు.

కర్ణాటకలో కరెంటు కొరతపై సీఎం కేసీఆర్‌ మాట్లాడుతూ.. ‘కర్ణాటకలో 24 గంటల కరెంటు ఇస్తమని కాంగ్రెస్‌ ఓట్లు వేయించుకున్నది. తీరా ప్రజలు గెలిపించినంక 5 గంటలే కరెంటే ఇస్తున్నరు. దాంతో రైతులు గోస పడుతున్నరు. కరెంటు లేక పంటలకు నీళ్లు చాలడం లేదని రైతులు పురుగుల మందు తాగి చచ్చిపోతమంటున్నరు. నిన్న కర్ణాటక ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్‌ తెలంగాణకు వచ్చి మేం మా రాష్ట్రంలో 5 గంటల కరెంటు ఇస్తున్నం గప్పాలు చెప్పిండు. కావాలంటే మీరు వచ్చి సూడుండ్రి బస్సులు పెడతం అన్నడు.  మేం 24 గంటల కరెంటు ఇస్తుంటే మీ 5 గంటల కరెంటు సూడనీకి మేమెందుకు రావాలె అన్నం’ అని తెలిపారు.