Business Lookback 2024 : 2024 సంవత్సరంలో భారతదేశం పలువురు వ్యాపార దిగ్గజాలను కోల్పోయింది. ఆయా వ్యాపార రంగాల్లో చెరగని ముద్ర వేసిన మహామహులను భారతావని మిస్ అయింది. ఇక వారు లేరు అనే నిజాన్ని వ్యాపార ప్రపంచం నేటికీ జీర్ణించుకోలేకపోతోంది. మనకు భౌతికంగా దూరమై.. పరలోకానికి ఏగిన ఆ గొప్ప పారిశ్రామిక దిగ్గజాలను ఓసారి స్మరించుకుందాం..
Also Read :Employee Theft : శాలరీ రూ.13వేలు.. బీఎండబ్ల్యూ కారు కొనేశాడు.. గర్ల్ ఫ్రెండ్‌కు గిఫ్టుగా 4 బీహెచ్‌కే ఫ్లాట్
రతన్ టాటా
రతన్ టాటా సిసలైన ఐకాన్. యావత్ భారత పౌరులకు ఆయన ఆదర్శనీయుడు. వ్యాపారం చేయడమే కాదు.. దానిలో వచ్చిన లాభాలను సమాజం కోసం ఖర్చు పెట్టే విషయంలో ఆయన నెలకొల్పిన ప్రమాణం చాలా గొప్పది. ఎంతోమంది వ్యాపార దిగ్గజాలకు రతన్ టాటాయే రోల్ మోడల్. ఆయన 86 ఏళ్ల వయసులో వృద్ధాప్య సంబంధిత ఆరోగ్య సమస్యలతో ఈ ఏడాది అక్టోబర్ 9న తుదిశ్వాస విడిచారు. పేటీఎం, స్నాప్‌డీల్, ఓలా, అర్బన్ కంపెనీ(Business Lookback 2024) వంటి విజయవంతమైన కంపెనీలకు తొలుత పెట్టుబడిని సమకూర్చిన గొప్ప పెట్టుబడిదారుడిగానూ రతన్ టాటా సక్సెస్ అయ్యారు. వివిధ రంగాలకు చెందిన 40 స్టార్టప్‌లకు ఆయన ఆర్థికంగా అండదండ అందించారు.
శశి రూయా
ఎస్సార్ వ్యాపార గ్రూప్ చాలా పెద్దది. ఇది కుటుంబ వ్యాపార సంస్థ. ఎస్సార్ గ్రూప్ ఛైర్మన్ శశికాంత్ రూయా అనారోగ్యంతో బాధపడుతూ 81 ఏళ్ల వయసులో నవంబర్ 25న కన్నుమూశారు. ఆయన హయాంలో ఎస్సార్ గ్రూపు ఉక్కు, చమురు శుద్ధి, టెలికాం, పవర్, నిర్మాణ రంగాల్లో భారీగా విస్తరించింది. 1969లో తన సోదరుడు రవికాంత్ రూయాతో కలిసి ఎస్సార్ గ్రూప్‌కు శశికాంత్ రూయా పునాది వేశారు. 1969లో చెన్నై పోర్ట్‌లో ఔటర్ బ్రేక్‌వాటర్‌ను నిర్మించడం ద్వారా వారి కంపెనీ యాక్టివిటీ మొదలైంది.
Also Read :CM Revanth Shock To Tollywood: టాలీవుడ్‌కు ఊహించని షాక్.. బెనిఫిట్ షోలు ఉండవన్న సీఎం రేవంత్
సుభాష్ దండేకర్
స్టేషనరీ వ్యాపారంలోనూ అద్భుతాలు చేయొచ్చని నిరూపించారు వ్యాపారవేత్త సుభాష్ దండేకర్. ఐకానిక్ స్టేషనరీ బ్రాండ్ కామ్లిన్ ఈయనదే. ఈ ఏడాది జులై 15న 86 ఏళ్ల వయసులో సుభాష్ తుదిశ్వాస విడిచారు. కామ్లిన్ కంపెనీని 1931లో సుభాష్ దండేకర్ తండ్రి దిగంబర్ దండేకర్, ఆయన మేనమామ జీపీ దండేకర్ కలిసి ప్రారంభించారు. 1998లో ఇది పబ్లిక్ లిమిటెడ్ కంపెనీగా అవతరించింది. సుభాష్ దండేకర్ ఈ కంపెనీ పగ్గాలు చేపట్టిన తర్వాత ఆర్ట్ మెటీరియల్స్, రైటింగ్ ఇన్‌స్ట్రుమెంట్స్, ఆఫీస్ సామాగ్రి వంటివి తయారు చేయడం మొదలుపెట్టారు.2005లో జపనీస్ కంపెనీ కొకుయో క్యామ్లిన్‌లో మెజారిటీ వాటాను కొనేశారు. తద్వారా ‘కొకుయో క్యామ్లిన్’ అనే పేరుతో కంపెనీకి సుభాష్ రీబ్రాండింగ్ చేయించారు.
రఘునందన్ శ్రీనివాస్ కామత్
ఐస్ క్రీమ్ వ్యాపారంలో సత్తాచాటిన వ్యాపారవేత్త రఘునందన్ శ్రీనివాస్ కామత్. ఈయన కంపెనీ పేరు “నేచురల్స్ ఐస్ క్రీమ్”. 75 సంవత్సరాల వయస్సులో ఈ ఏడాది మే నెలలో ఆయన చనిపోయారు. కామత్ తండ్రి కర్ణాటకలోని ముల్కి అనే పట్టణంలో మామిడికాయల వ్యాపారం చేసేవారు. రఘునందన్ శ్రీనివాస్ కామత్ 14 ఏళ్ళ వయసులో ముంబైకి వెళ్లారు. అక్కడ తన సోదరుడి రెస్టారెంటులో పని చేశారు. 1984లో కామత్ నలుగురు ఉద్యోగులు, పన్నెండు రుచులతో ఐస్ క్రీమ్ వ్యాపారం మొదలుపెట్టారు. తదుపరిగా తన కంపెనీ నేచురల్స్ ఐస్‌క్రీమ్‌ను 15 రాష్ట్రాలకు విస్తరించారు. 165కి పైగా ఔట్‌లెట్లను ఏర్పాటు చేశారు. రూ. 300 కోట్ల టర్నోవర్‌ను సాధించారు.