HHVM : ‘హరి హర వీరమల్లు’ ట్రైలర్‌పై నిర్మాత కీలక అప్‌డేట్

HHVM : పవర్ స్టార్ పవన్ కల్యాణ్ ప్రధాన పాత్రలో నటిస్తున్న భారీ చారిత్రక యాక్షన్ చిత్రం ‘హరి హర వీరమల్లు’ త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సినిమాను రెండు భాగాలుగా తెరకెక్కిస్తున్నారు.

Published By: HashtagU Telugu Desk
Hari Hara Veera Mallu

Hari Hara Veera Mallu

HHVM : పవర్ స్టార్ పవన్ కల్యాణ్ ప్రధాన పాత్రలో నటిస్తున్న భారీ చారిత్రక యాక్షన్ చిత్రం ‘హరి హర వీరమల్లు’ త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సినిమాను రెండు భాగాలుగా తెరకెక్కిస్తున్నారు. మొదటి భాగాన్ని జూన్ 12న విడుదల చేయనున్నట్టు నిర్మాతలు ఇప్పటికే ప్రకటించారు. ఈ భారీ బడ్జెట్ చిత్రానికి క్రిష్ జాగర్లమూడి కథను అందించగా, జ్యోతికృష్ణ దర్శకత్వ బాధ్యతలు చేపట్టారు. సినిమా విడుదల దగ్గరపడుతున్న వేళ ప్రచార కార్యక్రమాలు వేగంగా కొనసాగుతున్నాయి. ఈ క్రమంలో నిర్మాత ఏఎం రత్నం పలు మీడియా ఇంటర్వ్యూల్లో పాల్గొంటూ సినిమాకు సంబంధించిన ఆసక్తికర విషయాలను వెల్లడిస్తున్నారు.

India -US : నోటీసులకు స్పందించని అగ్రరాజ్యం.. రాయితీలకు కోత విధించే యోచనలో భారత్‌

తాజాగా, సినిమా ట్రైలర్ విడుదలపై వస్తున్న ప్రశ్నలకు స్పందించిన ఏఎం రత్నం, “ట్రైలర్ కోసం అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారని మాకు తెలుసు. అయితే రెండో భాగంలో విస్తృతంగా సీజీ వర్క్ ఉండటంతో ట్రైలర్ విడుదలలో కొంత ఆలస్యం ఏర్పడింది. ప్రస్తుతం సీజీ పనులు వేగంగా జరుగుతున్నాయి. అవి పూర్తయిన వెంటనే ట్రైలర్ విడుదల చేస్తాం” అని తెలిపారు. పోస్ట్ ప్రొడక్షన్ పనులకు సమయమే ప్రధాన కారణమని, అందువల్లే సినిమా విడుదల తేదీ జూన్ 12గా ఖరారు చేశామని ఆయన వివరించారు.

అలాగే, సినిమా దర్శకుల మార్పుపై స్పందించిన రత్నం, “ఇది క్రిష్ ప్రాజెక్ట్‌. కథను చెప్పింది ఆయనే. ఆయన చెప్పిన కథ ఎంతో బాగా నచ్చింది. పవన్ కల్యాణ్ అయితేనే ఈ పాత్రకు న్యాయం జరుగుతుందని భావించాం. కానీ కోవిడ్ కారణంగా ప్రాజెక్ట్ ఆలస్యమైంది. తర్వాత క్రిష్‌కు ఇతర కమిట్‌మెంట్లు రావడంతో, నా కుమారుడు జ్యోతికృష్ణ దర్శకత్వ బాధ్యతలు చేపట్టాడు. అయితే క్రిష్ ఈ ప్రాజెక్ట్‌కి పూర్తిగా సహకరించారు” అని తెలిపారు.

ఈ చిత్రంపై ఇప్పటికే భారీ అంచనాలు ఏర్పడ్డాయి. విడుదలైన టీజర్, పాటలు, పోస్టర్లు సినిమాపై ఉత్సాహాన్ని మరింతగా పెంచేశాయి. ఎంఎం కీరవాణి సంగీతాన్ని అందిస్తుండగా, నిధి అగర్వాల్ హీరోయిన్‌గా నటిస్తోంది. అలాగే బాబీ డియోల్, సత్యరాజ్, జిషు సేన్‌గుప్తా తదితరులు ముఖ్య పాత్రల్లో కనిపించనున్నారు. విశేషంగా, టెక్నికల్ స్టాండర్డ్స్, గ్రాండ్ ప్రొడక్షన్ వాల్యూస్ తో రూపుదిద్దుకుంటున్న ఈ చిత్రం, పవన్ అభిమానులకే కాదు తెలుగు సినీ ప్రేక్షకులకు ప్రత్యేకంగా ఆకర్షణగా మారనుందని పరిశ్రమ వర్గాల అభిప్రాయం.

Telangana Formation Day : రాష్ట్రం ఏర్పడి పదేళ్లయినా ప్రజల ఆకాంక్షలు నెరవేరలేదు – సీఎం రేవంత్

  Last Updated: 02 Jun 2025, 01:20 PM IST