Cigarete: పొగ రాయిళ్లకు ఊహించని షాక్.. అమ్మకాలు బ్యాన్ చేసిన కేంద్రం?

ప్రస్తుత రోజుల్లో చాలామంది యువత చిన్న వయసులోనే స్మోకింగ్ అలవాటును నేర్చుకుంటున్నారు. యూత్ అయితే

Published By: HashtagU Telugu Desk
Tobacco Products

Tobacco Products

ప్రస్తుత రోజుల్లో చాలామంది యువత చిన్న వయసులోనే స్మోకింగ్ అలవాటును నేర్చుకుంటున్నారు. యూత్ అయితే సిగరెట్ ని స్టైల్ గా తాగుతూ తెగ ఎంజాయ్ చేస్తుంటారు. అయితే ఈ స్మోకింగ్ వల్ల అనేక రకాల అనారోగ్య సమస్యలు తలెత్తుతాయని తెలిసి కూడా వాటిని తాగుతూనే ఉంటారు. పెద్దవారు మాత్రమే కాకుండా చిన్న పిల్లలు కూడా వీటిని తాగడం అలవాటు చేసుకున్నారు. అయితే తాజాగా సిగరెట్ తాగేవారికి కేంద్రం ఒక ఊహించని షాక్ ఇచ్చింది. ఎందుకంటే సిగరెట్లు లూజ్ సేలింగ్ బ్యాన్ చేసే విధంగా కేంద్రం సిద్ధం అవుతోంది.

పార్లమెంట్ స్టాండింగ్ కమిటీ పొగాకు ఉత్పత్తుల వినియోగాన్ని అరికట్టే విధంగా సింగల్ సిగరెట్ల అమ్మకాలను బ్యాన్ చేయాలని సలహా ఇచ్చినట్టు తెలుస్తోంది. లూస్ సిగరెట్ల అమ్మకాలు పొగాకు నియంత్రణపై చేస్తున్న ప్రచారాన్ని ప్రభావితం చేస్తున్నాయని కమిటీ సభ్యుల వాదన. అంతే కాకుండా దేశంలోని అన్ని ఎయిర్పోర్టులో స్మోకింగ్ జోన్ లను తొలగించాలని కూడా కమిటీ సిపార్స్ చేయడంతో సిగరెట్ రాయుళ్లకు షాక్ తప్పదని నివేదికలు చెబుతున్నాయి. పొగాకు ఉత్పత్తుల వినియోగాన్ని తగ్గించడం కోసం సింగిల్ సిగరెట్ ల విక్రయం పై పరిమితి విధించాలని పార్లమెంట్ స్టాండింగ్ కమిటీ సిఫార్సు చేసింది.

ఈ క్రమంలోని ఆరోగ్య మంత్రిత్వ శాఖ సలహా మేరకు కేంద్ర ప్రభుత్వం మూడేళ్ల క్రితం ఈ సిగరెట్లు అమ్మకాలు అలాగే వినియోగాన్ని నిషేధించిన విషయాన్ని మరొకసారి గుర్తు చేశారు. పార్లమెంట్ స్టాండింగ్ కమిటీ ప్రకారం సింగిల్ సిగరెట్ల అమ్మకం పొగాకు వినియోగానికి వ్యతిరేకంగా పోరాటం పై ప్రభావం చూపుతోందని తెలిపింది. భారత ప్రభుత్వం పొగాకు వస్తువులపై 75శాతం జిఎస్టిని అమలు చేయాలని దేశంలో పన్ను స్లాబ్ ల ప్రకారం బీడీలపై 22 శాతం, సిగరెట్లపై 53 శాతం జిఎస్టి పొగలేని పొగాకు పై 64 శాతం జీఎస్టీ ఎనిమిదిస్తోంది. జిఎస్టి అమల్లోకి వచ్చిన తర్వాత పోగాకు వస్తువులపై పెద్దగా పన్నులు జరగలేదని స్టాండింగ్ కమిటీ గుర్తించింది. కాగా ఇప్పటికే భారతదేశంలో బహిరంగ ప్రదేశాలలో ధూమపానం నిషేధించిన విషయం తెలిసిందే. ఒకవేళ ఈ చట్టాన్ని ఉల్లంఘిస్తే 200 వరకు జరిమానా విధించవచ్చు. అదే విధంగా పొగాకు ఉత్పత్తుల ప్రకటనలను కూడా ప్రభుత్వం నిషేధించిన విషయం తెలిసిందే.

  Last Updated: 12 Dec 2022, 06:09 PM IST