Gold- Silver: స్థిరంగా బంగారం, వెండి ధరలు.. హైదరాబాద్ లో తులం ఎంతంటే..?

కొంతకాలంగా హెచ్చుతగ్గులకు లోనవుతున్న పసిడి ధరలు (Gold- Silver) నేడు పెరిగాయి.

  • Written By:
  • Updated On - November 30, 2023 / 07:05 AM IST

Gold- Silver: కొంతకాలంగా హెచ్చుతగ్గులకు లోనవుతున్న పసిడి ధరలు (Gold- Silver) నేడు స్థిరంగా ఉన్నాయి. బుధవారం ఉదయం హైదరాబాద్‌లో 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ.57,350గా ఉంది. 10 గ్రాముల 24 క్యారెట్ల పసిడి ధర రూ. 62,560గా నమోదైంది. విజయవాడ, విశాఖపట్నంలో కూడా ఇవే ధరలు అమలవుతున్నాయి. కాగా.. కిలో వెండి ధర రూ.81,500కు చేరుకుంది. ఏపీ, తెలంగాణవ్యాప్తంగా ఇవే ధరలు అమలులో ఉన్నాయి.

బంగారం, వెండి ధ‌రలలో మార్పులు చోటు చేసుకునేందుకు అనేక కారణాలున్నాయంటున్నారు బులియన్‌ మార్కెట్‌ నిపుణులు. అంతర్జాతీయ మార్కెట్ పసిడి ధరల్లో మార్పు, ద్రవ్యోల్బణం, కేంద్ర బ్యాంకుల వద్ద ఉన్న బంగారం నిల్వలు, వాటి వడ్డీ రేట్లు, కరోనా, జువెలరీ మార్కెట్, భౌగోళిక ఉద్రిక్తతలు, వాణిజ్య యుద్ధాలు వంటి తదితర కారణాలు పసిడి రేట్లపై అధిక ప్రభావం చూపే అవకాశం ఉందని బులియన్‌ మార్కెట్‌ నిపుణులు చెబుతున్నారు. ఇక బుధవారం (నవంబర్ 29, 2023) దేశీయంగా బంగారం, వెండి ధరలు ఇలా ఉన్నాయి. ఇక దేశంలోని ప్రధాన నగరాల్లో నేటి ధరల వివరాలివే..!

Also Read: Vizag : వైజాగ్‌లో హోట‌ల్స్‌పై విజిలెన్స్ అధికారుల త‌నిఖీలు.. నిల్వ ఉంచిన ఆహారాన్ని..?

బంగారం ధ‌ర‌లు

దేశ రాజధాని ఢిల్లీలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.57,500 ఉండగా, 24 క్యారెట్ల ధర రూ.62,710గా ఉంది. ఇక చెన్నైలో 22 క్యారెట్ల పసిడి ధర రూ.57,800 కాగా.. 24 క్యారెట్ల బంగారం ధర రూ. 63,050గా ఉంది. దేశ ఆర్థిక రాజధాని ముంబైలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.57,350 వద్ద కొనసాగుతుండగా, 24 క్యారెట్ల ధర రూ.62,560 వద్ద ఉంది. కోల్‌కతాలో 22 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధర రూ.57,350 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.62,560గా ఉంది. బెంగళూరులో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.57,350 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.62,560గా ఉంది.

We’re now on WhatsApp. Click to Join.

వెండి ధరలు

ఢిల్లీలో కిలో వెండి ధర రూ. 78,500 ఉండగా, ముంబైలో రూ.78,500గా ఉంది. ఇక చెన్నైలో కిలో వెండి ధర రూ.81,500 ఉండగా, కోల్‌కతాలో రూ.78,500గా ఉంది. బెంగళూరులో కిలో వెండి ధర రూ.78,000 ఉండగా, కేరళలో రూ.81,500గా ఉంది. హైదరాబాద్‌లో కిలో వెండి ధర రూ.81,500 ఉండగా, విజయవాడలో రూ.81,500 వద్ద కొనసాగుతోంది. విశాఖ‌ప‌ట్నంలో కూడా ఇదే ధర కొనసాగుతోంది.