అనకాపల్లి జిల్లా పరవాడలోని ఫార్మా సిటీలోని దక్షిణ్ ఎనర్జీలో జరిగిన అగ్ని ప్రమాద ఘటనపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు విచారం వ్యక్తం చేశారు. ఈ ఘటనలో ఇద్దరు కార్మికుల మృతిపై సీఎం తన సంతాపం తెలియచేశారు. జిల్లా అధికారులతో మాట్లాడి ప్రమాదం జరిగిన తీరుపై సీఎం వివరాలు అడిగి తెలుసుకున్నారు. ప్రమాదం జరిగిన వెంటనే ఫార్మా సిటీ అగ్నిమాపక కేంద్రం నుంచి రెండు, పరవాడ నుంచి మరొక అగ్ని మాపక శకటాలు చేరుకుని మంటలు అదుపులోకి తెచ్చాయాని అధికారులు సీఎంకు వివరించారు. ప్రమాదంలో గాయపడిన వారికి మెరుగైన చికిత్స అందించాలని సీఎం చంద్రబాబు ఆదేశించారు. బాధిత కుటుంబాలకు అండగా నిలవాలని సూచించారు.
Chandrababu : విశాఖ ఫార్మా సిటీ అగ్ని ప్రమాద ఘటనపై సీఎం చంద్రబాబు విచారం
అనకాపల్లి జిల్లా పరవాడలోని ఫార్మా సిటీలోని దక్షిణ్ ఎనర్జీలో జరిగిన అగ్ని ప్రమాద ఘటనపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు విచారం వ్యక్తం చేశారు. ఈ ఘటనలో ఇద్దరు కార్మికుల మృతిపై సీఎం తన సంతాపం తెలియచేశారు. జిల్లా అధికారులతో మాట్లాడి ప్రమాదం జరిగిన తీరుపై సీఎం వివరాలు అడిగి తెలుసుకున్నారు. ప్రమాదం జరిగిన వెంటనే ఫార్మా సిటీ అగ్నిమాపక కేంద్రం నుంచి రెండు, పరవాడ నుంచి మరొక అగ్ని మాపక శకటాలు చేరుకుని మంటలు అదుపులోకి తెచ్చాయాని […]

Cbn Speech
Last Updated: 23 Jun 2026, 12:00 PM IST