Site icon HashtagU Telugu

Fitness Trainer Arrested: టాలీవుడ్ హీరో ఫిట్ నెస్ ట్రెయినర్ పై రేప్ కేసు, ముంబైలో అరెస్టు..!!

Crime

Crime

టాలీవుడ్ కు చెందిన అగ్రనటుడి ఫిట్ నెస్ ట్రైనర్ పై ముంబైలో కేసు నమోదు అయ్యింది. ఓ యువతి తనపై అత్యాచారం చేశాడని దక్షిణ ముంబైలో ని కఫ్ పరేడ్ పోలీస్ స్టేషన్ ఫిర్యాదు చేసింది. దీంతో ఫిట్ నెస్ ట్రేయినర్ ఆదిత్య కపూర్ ను పోలీసులు మంగళవారం అదుపులోకి తీసుకున్నారు.

తనన పెళ్లి చేసుకుంటానని చెప్పి…కొన్ని రోజులుగా అత్యాచారానికి పాల్పడ్డాని…ఇప్పుడు మొహం చాటేశాడని బాధితురాలు ఫిర్యాదులో పేర్కొంది. వారిద్దరికి సంబంధించిన ప్రైవేట్ ఫొటోలను సోషల్ మీడియాలో షేర్ చేస్తానంటూ బెదిరిస్తున్నాడని బాధితురాలు వాపోయింది. ఈ విషయం బయటకు చెబితే చంపేస్తానంటూ బెదిరించడంతో…పోలీసులను ఆశ్రయించినట్లు బాధితురాలు ఫిర్యాదులో పేర్కొంది. దీంతో నిందితుడిపై పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేసిన పోలీసులు అరెస్టు చేశారు.