Israel-Hamas war: ఇజ్రాయెల్ పై హమాస్ క్రూరమైన దాడికి దిగింది. చంపవద్దని వేడుకున్నా కనికరం చూపలేదు. స్త్రీ, పురుష తారతమ్యం లేకుండా 1400 మందికి పైగా విచక్షణారహితంగా హత్య చేశారు. దీంతో హమాస్‌ను నాశనం చేస్తామని ఇజ్రాయెల్ శపథం చేసింది. హమాస్ లోని గాజాపై బాంబుల వర్షం కురిసింది. ఇజ్రాయెల్ దాడుల్లో 4500 మందికి పైగా చనిపోయారు. వందల మంది గాయపడ్డారు. గాజాపై ఇజ్రాయెల్ దాడి కొనసాగిస్తోంది. ఈ యుద్ధం కారణంగా గాజాలో పరిస్థితి దయనీయంగా మారింది. గాజాలో ఆహారం కోసం ప్రజలు గంటల తరబడి క్యూలో నిలబడాల్సిన దుస్థితి. దీంతో గాజా ప్రజలు సాయం కోసం ఎదురుచూస్తున్నారు. ఈ నేపథ్యంలో గాజాకు సాయం చేసేందుకు ఈజిప్ట్ ముందుకు వచ్చింది.మొదటి విడత కింద ఈజిప్ట్ నుండి పాలస్తీనియన్ ఎన్‌క్లేవ్‌లోకి 20 ట్రక్కులు ప్రవేశించాయి. కానీ గాజాలో 2.4 మిలియన్ల మంది నివాసితులు ఉన్నారు.
Also Read: Bathukamma: తెలంగాణ ప్రజలకు బతుకమ్మ శుభాకాంక్షలు: సీఎం కేసీఆర్