Site icon HashtagU Telugu

DU Girl Murder : ఇనుప రాడ్ తో తలపై కొట్టి విద్యార్థిని హత్య.. బాయ్ ఫ్రెండ్ ఘాతుకం

Du Girl Murder

Du Girl Murder

DU Girl Murder : ఢిల్లీలో దారుణం జరిగింది.. 

ఢిల్లీ యూనివర్సిటీలోని కమలా నెహ్రూ కాలేజీకి చెందిన 25 ఏళ్ల విద్యార్థిని దారుణ హత్యకు గురైంది..

దక్షిణ ఢిల్లీలోని మాల్వియా నగర్‌లో ఉన్న పార్క్‌లో ఆమె శవమై కనిపించింది .

ఆ స్టూడెంట్ డెడ్ బాడీ సమీపం నుంచి ఒక ఇనుప రాడ్ ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. 

చనిపోయిన విద్యార్థిని తలపై గాయాలు ఉన్నాయి..

ఇనుప రాడ్ తో దాడి చేయడం వల్లే విద్యార్థిని చనిపోయి ఉండొచ్చని పోలీసులు అనుమానిస్తున్నారు.

Also read : Andhra Pradesh: ఏపీ హైకోర్టు చీఫ్ జస్టిస్‌గా ధీరజ్‌ ప్రమాణస్వీకారం.. కలెక్టర్లతో సీఎం వీడియో కాన్ఫిరెన్స్

ఢిల్లీ సౌత్ జోన్ డీసీపీ చందన్ చౌదరి తెలిపిన వివరాల ప్రకారం.. బాధిత స్టూడెంట్ తన స్నేహితుడి తో కలిసి అరబిందో కాలేజీ సమీపంలోని పార్కుకు వచ్చింది.  అయితే ఇద్దరి మధ్య దేనిపై గొడవ జరిగిందో ఏమో.. స్నేహితుడు అక్కడున్న ఇనుప రాడ్‌ తీసుకొని తలపై బలంగా మోదాడు. దీంతో ఆ విద్యార్థిని అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయింది. ఆ వెంటనే హత్య చేసిన వ్యక్తి పరారయ్యాడు. విచారణ కొనసాగుతోందని డీసీపీ తెలిపారు. గురువారం ఢిల్లీలోని దబ్రీ పోలీస్ స్టేషన్ పరిధిలో 42 ఏళ్ల మహిళ రేణు గోయల్‌ ఇంటికి ఆశిష్‌ అనే వ్యక్తి వచ్చి నాటు తుపాకీతో విచక్షణారహితంగా  కాల్పులు జరిపాడు. ఆ మహిళను హత్య చేసిన తర్వాత నిందితుడు ఆశిష్‌ తన ఇంటికి వెళ్లి, తుపాకీతో  కాల్చుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. నిందితుడికి, మహిళకు ఇంతకుముందే పరిచయమున్నట్లు వెలుగులోకి వచ్చింది. ఆశిష్, రేణు కలిసి ఒకే జిమ్‌కి వెళ్లేవారని తేలింది. రేణు భర్తకు రియల్ ఎస్టేట్ వ్యాపారం ఉందని, ముగ్గురు పిల్లలున్నారని పోలీసులు చెబుతున్నారు.

Also read : 250 Lottery-Won 10 Crore : 11 మంది కలిసి రూ.250తో లాటరీ కొంటే 10 కోట్లు వచ్చాయ్

ఢిల్లీలో మహిళలకు భద్రత ఏదీ ?  : స్వాతి మలివాల్

ఢిల్లీలో గత 24 గంటల్లో ఇద్దరు మహిళలు హత్యకు గురైన నేపథ్యంలో ఢిల్లీ మహిళా కమిషన్ చైర్‌పర్సన్ స్వాతి మలివాల్ ఘాటుగా స్పందించారు.  స్థానిక మహిళల భద్రతపై ఆమె ఆందోళన వ్యక్తం చేశారు. “ఢిల్లీలో ఒకచోట మహిళను  కాల్చి చంపారు. మరోచోట ఒక అమ్మాయిని రాడ్‌తో కొట్టి చంపారు. 24 గంటల్లోనే ఈ రెండు ఘోరాలు జరిగాయి. ఇవన్నీ జరిగాక ఢిల్లీ సురక్షితం అని ఎలా అంటారు. ఢిల్లీలో మహిళల భద్రతపై ఎవరికీ పట్టింపు లేదు. దేశ రాజధానిలో నేరాలు ఆగకపోవడం బాధాకరం” అని స్వాతి మలివాల్ పేర్కొన్నారు.

Exit mobile version