Site icon HashtagU Telugu

cancer pregnancy: 15 బాలిక ప్రెగ్నెంట్.. డాక్టర్ దగ్గరికి వెళ్ళగా ఊహించని షాక్?

Cancer Pregnancy

Cancer Pregnancy

పాపం ఒక బాలిక వయసు 15 ఏళ్లు. కానీ ఆమె జీవితంలో ఏవేవో మార్పులు. వెన్నులో నొప్పి కూర్చుంటే నించో లేదు నించుంటే కూర్చోలేదు అన్నట్టుగా మారిపోయింది. అయితే ఆ బాలిక పరిస్థితిగా అర్థం కాక బాలిక తల్లిదండ్రులు ఆమెను హాస్పిటల్ కి పిలుచుకుని వెళ్ళగా అక్కడ ఊహించని షాక్ ఎదురైంది. షాక్ ల మీద షాక్ లు ఎదురయ్యాయి. వైద్య పరీక్షల తర్వాత బయటపడ్డ నిజం విని నమ్మలేకపోయింది. తల్లిదండ్రులు ఏం అంటారో తెలియక తల్లడిల్లింది. వైద్యులు చెప్పింది నిజం కాదని ఆ అమ్మాయి నమ్మకం. కానీ చివరికి పరీక్షలు తర్వాత బయటపడ్డ మరో నిజం మరింత ఘోరంగా, దారుణంగా ఉంది.

అసలేం జరిగిందంటే.. ప్రస్తుతం 19 ఏళ్ల వయసున్న హాలీ అనే టీనేజ్‌ అమ్మాయి 2019 జనవరిలో వెన్ను నొప్పితో అల్లాడిపోయింది. దాంతో ఆ బాలికను తల్లిదండ్రులు ఆసుపత్రికి తీసుకుని వెళ్లారు.. పలు వైద్య పరీక్షలు నిర్వహించి ఆమె ప్రెగ్నెంట్‌ అని తేల్చారు. దాంతో ఆ అమ్మాయికి ఒక్కసారిగా గుండె ఆగిపోయినంత పని అయ్యింది. అయితే ఆమెకు తాను ప్రెగ్నెంట్ కాదు అని గట్టి నమ్మకం. ఎందుకంటే ఆమె వయసు 15 ఏళ్ల మాత్రమే. ఈ విషయం విని తన తల్లిదండ్రులు ఏం అనుకుంటారోనని చాలా భయపడి పోయింది. అయితే డాక్టర్ చెప్పిన విషయాన్ని బాలిక తల్లికి వివరించగా ఆమె తల్లి దీన్ని నమ్మలేదు. మరోవైపు ఆమె బరువు తగ్గిపోవడం, తలనొప్పి, అలసట వంటి విపరీతమైన సమస్యలను ఎదుర్కొంటోంది.

ఆమె తల్లిదండ్రలు జోక్యంతో ఆమెకు మరిన్ని పరీక్షలు నిర్వహించారు వైద్యులు. చివరికి అల్ట్రాసౌండ్‌ పరీక్షలో ఆమె కడుపులో బిడ్డ లేదని తేలింది. కానీ రిపోర్ట్‌ల్లో గుండె పగిలే మరో నిజం బయటపడింది ఈ నిజం ఆమెను, తల్లిదండ్రులను తీవ్ర bb క్యాన్సర్‌ ఉందని తేలింది. ఆ కణుతులు ఊపిరితిత్తుల వరకు వ్యాపించి స్టేజ్‌ 4దశలో ఉన్నట్లు వెల్లడైంది. చివరికి పలు చికిత్సలు అనంతరం ఇప్పుడిప్పుడే నెమ్మదిగా కోలుకుంటోంది హాలీ.

Exit mobile version