Vijayawada: బెజ‌వాడ ప్ర‌భుత్వ ఆసుప‌త్రిలో క‌రోనా క‌ల‌క‌లం

గ‌త వారం రోజులుగా క‌రోనా పాజిటివ్ కేసుల సంఖ్య పెరుగుతున్నాయి. సంక్రాంతి పండుగ త‌రువాత ఈ కేసులు మ‌రింత ఎక్కువ‌య్య‌యి. ఇత‌ర రాష్ట్రాల నుంచి..

  • Written By:
  • Publish Date - January 18, 2022 / 10:30 AM IST

గ‌త వారం రోజులుగా క‌రోనా పాజిటివ్ కేసుల సంఖ్య పెరుగుతున్నాయి. సంక్రాంతి పండుగ త‌రువాత ఈ కేసులు మ‌రింత ఎక్కువ‌య్య‌యి. ఇత‌ర రాష్ట్రాల నుంచి.. ఇత‌ర జిల్లాల నుంచి పెద్ద సంఖ్య‌లో ప్ర‌జ‌లు త‌మ సొంతూళ్ల‌కు వెళ్ల‌డంతో వైర‌స్ వ్యాప్తి ఎక్కువైన‌ట్లు నిపుణులు అంటున్నారు. తాజాగా విజయవాడ ప్రభుత్వ ఆసుపత్రిలో కరోనా కలకలం రేపుతోంది. ఆస్పత్రి సూపరింటెండెంట్‌ రవికిరణ్‌కు కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయ్యింది. ప్రస్తుతం ఆయన హోం ఐసోలేష‌న్ లో ఉండి చికిత్స తీసుకుంటున్నారు. అయితే ఆయనతో పాటు మరో 25 మంది జూనియర్ డాక్టర్లు, ఇతర వైద్యులకు పాజిటివ్ అని తేలింది.

అలాగే పారామెడికల్ సిబ్బంది కూడా కరోనా బారిన పడ్డారు. దీంతో ప్రభుత్వాస్పత్రిలో మొత్తం 50 మంది వైద్య సిబ్బందికి కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయ్యింది. ఇంత మంది వైద్యులు కరోనా బారిన పడటంతో ఆస్పత్రిలో మిగిలిన వైద్యులు, రోగులు ఆందోళన చెందుతున్నారు.

గ‌త వారం రోజులుగా క‌రోనా పాజిటివ్ కేసుల సంఖ్య పెరుగుతున్నాయి. సంక్రాంతి పండుగ త‌రువాత ఈ కేసులు మ‌రింత ఎక్కువ‌య్య‌యి. ఇత‌ర రాష్ట్రాల నుంచి.. ఇత‌ర జిల్లాల నుంచి పెద్ద సంఖ్య‌లో ప్ర‌జ‌లు త‌మ సొంతూళ్ల‌కు వెళ్ల‌డంతో వైర‌స్ వ్యాప్తి ఎక్కువైన‌ట్లు నిపుణులు అంటున్నారు. తాజాగా విజయవాడ ప్రభుత్వ ఆసుపత్రిలో కరోనా కలకలం రేపుతోంది. ఆస్పత్రి సూపరింటెండెంట్‌ రవికిరణ్‌కు కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయ్యింది. ప్రస్తుతం ఆయన హోం ఐసోలేష‌న్ లో ఉండి చికిత్స తీసుకుంటున్నారు.

అయితే ఆయనతో పాటు మరో 25 మంది జూనియర్ డాక్టర్లు, ఇతర వైద్యులకు పాజిటివ్ అని తేలింది. అలాగే పారామెడికల్ సిబ్బంది కూడా కరోనా బారిన పడ్డారు. దీంతో ప్రభుత్వాస్పత్రిలో మొత్తం 50 మంది వైద్య సిబ్బందికి కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయ్యింది. ఇంత మంది వైద్యులు కరోనా బారిన పడటంతో ఆస్పత్రిలో మిగిలిన వైద్యులు, రోగులు ఆందోళన చెందుతున్నారు.