CM Revanth Reddy : సీఎం రేవంత్ రెడ్డితో టాలీవుడ్ పెద్దలు భేటీ కమాండ్ కంట్రోల్ సెంటర్ (సీసీసీ)లో ప్రారంభమైంది. సినీ ప్రముఖులతో భేటీకి మంత్రులు, కీలక అధికారులు హాజరయ్యారు. చిక్కడపల్లి ఏసీపీ, డీసీపీలను మీటింగ్‌కు పిలిచారు సీఎం రేవంత్ రెడ్డి. సంధ్య థియేటర్ ఘటనపై భేటీలో ప్రత్యేకంగా ప్రస్తావించే ఛాన్స్ కనిపిస్తుంది. అలాగే టికెట్ రేట్లు గురించి కూడా చర్చించే అవకాశం ఉంది. అయితే.. ఉదయం 10 గంటలకు బంజారాహిల్స్‌లోని పోలీస్ కమాండ్ కంట్రోల్ సెంటర్‌లో భేటీకి సినీ ఇండస్ట్రీ నుంచి దిల్ రాజు నేతృత్వంలో 45 మంది సభ్యులు.. 21 మంది నిర్మాతలు, 13 మంది దర్శకులు, 11 మంది నటులు హాజరయ్యారు. వారిలో అల్లు అరవింద్, నాగవంశీ, మురళీమోహన్, నాగార్జున, త్రివిక్రమ్, హరీష్ శంకర్, కొరటాలశివ, వశిష్ఠ, సాయిరాజేష్, బోయపాటి శ్రీను, సి.కల్యాణ్ లతొ పాటు తదితరులు ఉన్నారు. అలాగే మీటింగ్‌కి డీజీపీ జితేందర్, హోంశాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ రవిగుప్తా వచ్చారు.
Nara Lokesh Slams Jagan: జగన్ నువ్వు మారవా? బరితెగించావు అంటూ నారా లోకేష్ ట్వీట్!
అయితే.. కాసేపటి క్రితమే సీఎం రేవంత్ రెడ్డి కమాండ్ కంట్రోల్ సెంటర్‌కు చేరుకున్నారు. అయితే.. సీఎం రేవంత్ రెడ్డితో పాటు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, సినిమాటోగ్రఫీ మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి సీసీసీకి చేరుకున్నారు. అయితే సీసీసీలోకి వెళ్లే ముందు మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ.. బెనిఫిట్ షోలు, టికెట్ల ధరల పెంపు ఉండదని వెల్లడించారు. సీఎం రేవంత్ రెడ్డి భేటీలో ఇవే ప్రధాన ఎజెండాగా తెలుస్తోంది. అంతేకాకుండా… యాంటీ డ్రగ్స్ క్యాంపెయిన్‌కు సహకరించాలని ప్రభుత్వం కోరినట్లు, ప్రచార కార్యక్రమాల్లో సినిమా హీరోలే ఉండాలని సర్కార్ ప్రతిపాదనలు పెట్టినట్లు సమాచారం.
ఇవేకాకుండా.. టికెట్ల ధరలపై విధించే సెస్‌ను.. ఇంటిగ్రేటెడ్ స్కూల్స్‌కి వినియోగించాలని, ఇకపై ర్యాలీలు నిషేధిస్తామని, కులగణన సర్వేపై తారలు ప్రచారానికి ముందుకు రావాలని, ప్రభుత్వం చేస్తున్న మంచి పనులకు ఇండస్ట్రీ సహకారం ఉండాలని ప్రభుత్వం ప్రపోజల్ పెట్టనున్నట్లు తెలుస్తోంది. అయితే.. సంక్రాంతికి విడుదలకు సినిమాలు సిద్ధంగా ఉండగా.. ఈ నేపథ్యంలో ఇలాంటి ఒక సమావేశం జరగడం సర్వత్రా ఉత్కంఠ రేపుతోంది. అయితే.. ఈ భేటీలో ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటారని అందరూ ఎదురుచూస్తున్నారు.
Fact Check : మండుతున్నది కుర్‌కురే పొడి కాదు.. అమోనియం డైక్రోమేట్