Site icon HashtagU Telugu

CM Revanth Reddy : ఢిల్లీలో సీఎం రేవంత్ బిజీ బిజీ..

Revanth Rajan

Revanth Rajan

తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి (CM Revanth )..ఢిల్లీలో బిజీ బిజీ గా గడుపుతున్నారు. రెండు రోజుల పర్యటనలో భాగంగా ఈరోజు రక్షణశాఖ మంత్రి రాజ్​నాథ్ సింగ్​, కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ మంత్రి మనోహర్‌లాల్ ఖట్టర్‌తో భేటీ అయ్యారు. హైద‌రాబాద్‌లో ర‌హ‌దారుల విస్త‌ర‌ణ‌, ఇత‌ర అవ‌స‌రాల‌కు ర‌క్ష‌ణ శాఖ భూములు 2,450 ఎక‌రాల‌ను తెలంగాణ ప్ర‌భుత్వానికి బ‌దలాయించాల‌ని ర‌క్ష‌ణ శాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్‌కు సీఎం రేవంత్ రెడ్డి విజ్ఞ‌ప్తి చేశారు.

We’re now on WhatsApp. Click to Join.

రావిరాల గ్రామంలో తెలంగాణ ప్ర‌భుత్వానికి చెందిన 2,462 ఎక‌రాల భూముల‌ను ఇమార‌త్ ప‌రిశోధ‌న కేంద్రం (ఆర్‌సీఐ) ఉప‌యోగించుకుంటున్న విష‌యాన్ని కేంద్రం దృష్టికి తీసుకెళ్లారు. వ‌రంగ‌ల్ న‌గ‌రానికి గ‌తంలోనే సైనిక్ స్కూల్ మంజూరు చేసినా గ‌త రాష్ట్ర ప్ర‌భుత్వం నిర్మాణప‌రంగా ఎటువంటి చ‌ర్య‌లు తీసుకోలేద‌ని, వ‌రంగ‌ల్ సైనిక్ స్కూల్ అనుమ‌తుల గ‌డువు ముగిసినందున అనుమ‌తులు పున‌రుద్ధ‌రించాల‌ని లేదా తాజాగా మంజూరు చేయాల‌ని కేంద్ర మంత్రిని ముఖ్య‌మంత్రి కోరడం జరిగింది.

2024-25 ఆర్థిక సంవ‌త్స‌రంలో బీఎల్‌సీ మోడ‌ల్‌లో తెలంగాణ‌కు 2.70 ల‌క్ష‌ల ఇళ్లు మంజూరు చేయాల‌ని కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ మంత్రి మనోహర్‌లాల్ ఖట్టర్‌ ను విజ్ఞప్తి చేశారు. నిరుపేద‌లకు వారి సొంత స్థ‌లాల్లో 25 ల‌క్ష‌ల ఇళ్లు నిర్మించాల‌ని, రాష్ట్ర ప్ర‌భుత్వం లక్ష్యంగా పెట్టుకున్న విషయాన్ని కేంద్ర మంత్రి దృష్టికి తీసుకెళ్లారు. ఇక రేపు మరికొందరు కేంద్రమంత్రులను సీఎం కలవనున్నారు. నీట్ పరీక్ష అంశంపై మీడియా ప్రతినిధులు ఆయనను ప్రశ్నించారు.

ఈ సందర్భంగా సీఎం రేవంత్ మాట్లాడుతూ… ఏ ఒక్కరి పైనో కేసు వేసి క్లోజ్ చేసేందుకు సీబీఐ దర్యాఫ్తునకు ఆదేశించారని విమర్శించారు. కానీ జ్యుడీషియల్ విచారణ అవసరమన్నారు. ప్రధాని మోదీ విద్యార్థులకు భరోసా ఇవ్వడం లేదన్నారు. తెలంగాణకు సైనిక్ స్కూల్ కావాలని… ఇదే విషయమై తాను కేంద్రమంత్రి రాజ్‌నాథ్ సింగ్‌ను అడిగానన్నారు. ఆయన సానుకూలంగా స్పందించినట్లు తెలిపారు.

Read Also : MLC Jeevan Reddy : జీవన్ రెడ్డి ని బుజ్జగించే పనిలో కాంగ్రెస్ నేతలు