Chiru On Pushpa: పుష్ప దర్శకుడికి మెగాస్టార్ చిరంజీవి ప్రశంసలు!

పాన్ ఇండియా చిత్రం పుష్ప సినిమా సాధించిన బ్లాక్‌బస్టర్ విజయంతో అందరి ప్రశంసలు అందుకుంటున్న సృజనాత్మకత దర్శకుడు సుకుమార్‌ను మెగాస్టార్ చిరంజీవి అభినందనలతో ముంచెత్తారు.

Published By: HashtagU Telugu Desk
chiranjeevi

chiranjeevi

పాన్ ఇండియా చిత్రం పుష్ప సినిమా సాధించిన బ్లాక్‌బస్టర్ విజయంతో అందరి ప్రశంసలు అందుకుంటున్న సృజనాత్మకత దర్శకుడు సుకుమార్‌ను మెగాస్టార్ చిరంజీవి అభినందనలతో ముంచెత్తారు. అల్లు అర్జున్ హీరోగా మైత్రీ మూవీస్ పతాకంపై నవీన్ ఎర్నేని, వై.రవిశంకర్ నిర్మించిన ఈ పాన్ ఇండియా సినిమాను ఇటీవల మెగాస్టార్ వీక్షించారు. ఈ సందర్భంగా దర్శకుడు సుకుమార్‌ను ప్రత్యేకంగా ఆహ్వానించి సినిమాను తనకెంతో బాగా నచ్చిందని, అన్ని భాషల్లో పుష్పకు లభిస్తున్న ఆదరణ పట్ల తనకెంతో ఆనందంగా వుందని, సినిమాలో పుష్పరాజ్‌గా అల్లు అర్జున్ నటన చక్కగా వుందని, సినిమాలోని ప్రతి అంశం ఎంతో అద్భుతంగా వుందని, దర్శకుడుగా సుకుమార్ పడిన తపన, కష్టం ప్రతి ఫ్రేములో కనిపించదని, అందుకు తగ్గ ప్రతిఫలం బ్లాక్‌బస్టర్ రూపంలో వచ్చిందని చిరంజీవి ఈ సందర్భంగా కొనియాడారు.

  Last Updated: 28 Dec 2021, 12:11 AM IST