Site icon HashtagU Telugu

Bangladesh: చైనాతో కలిసి పని చేస్తాం: మహమ్మద్ యూనస్

Muhammad Yunus

Muhammad Yunus

Bangladesh: చైనా నుంచి భారీ పెట్టుబడులు వస్తే వారి దేశ ఆర్థిక వ్యవస్థలో విప్లవాత్మక మార్పులు కనిపిస్తాయని బంగ్లాదేశ్ తాత్కాలిక ప్రభుత్వ అధినేత మహమ్మద్ యూనస్ చెప్పారు. చైనా-బంగ్లాదేశ్ వాణిజ్య, పెట్టుబడి సంబంధిత సదస్సును ఆయన ప్రారంభించారు. ఈ కార్యక్రమం బంగ్లాదేశ్ ఇన్వెస్ట్‌మెంట్ డెవలప్‌మెంట్ అథారిటీ ఆధ్వర్యంలో నిర్వహించబడింది. చైనా వాణిజ్యశాఖ మంత్రి వాంగ్ వెంటావో ప్రత్యేక అతిథిగా హాజరయ్యారు.

యూనస్ మాట్లాడుతూ, ప్రపంచ వ్యాప్తంగా తయారీ రంగంలో చైనా కంపెనీలు మంచి పేరు సంపాదించాయని, బంగ్లాదేశ్ చైనాతో కలిసి పనిచేయడానికి సిద్ధంగా ఉన్నట్లు తెలిపారు. చైనా పెట్టుబడులు బంగ్లాదేశ్ ఆర్థిక పరిస్థితిని క్రమంగా మార్చగలవని ఆయన అభిప్రాయపడ్డారు.

Terrorist Spies : పంజాబ్‌లో ఉగ్ర గూఢచారుల ముఠా అరెస్ట్.. పాక్ ఐఎస్ఐతో అనుబంధాలు

బంగ్లాదేశ్ యువతకు మెరుగైన ఉపాధి అవకాశాలు కల్పించడం, ఆర్థిక వృద్ధిని వేగవంతం చేయడం ప్రభుత్వ ప్రధాన లక్ష్యాలు అని యూనస్ చెప్పారు. పెట్టుబడులను ఆకర్షించడం, చట్టాలను సులభతరం చేయడం, వ్యాపారానికి అనుకూల వాతావరణం సృష్టించడం ద్వారా దేశాన్ని ముందుకు తీసుకెళ్తున్నామని వివరించారు. ఇరు దేశాల ఆర్థిక సంబంధాలు మరింత బలపడుతుండటంతో ఈ సదస్సు ఒక మైలురాయిగా నిలుస్తుందన్నారు. చైనా కంపెనీలకు బంగ్లాదేశ్‌లో భారీ పెట్టుబడులు పెట్టాలని యూనస్ సూచించారు , చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్‌కు కృతజ్ఞతలు తెలిపారు.

ఇటీవల యూనస్ నాలుగు రోజుల పర్యటనకు చైనా వెళ్లారు. అక్కడ పలు కార్యక్రమాల్లో పాల్గొని, చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్‌తో సమావేశమయ్యారు. బంగ్లాదేశ్ ఆర్థిక వ్యవస్థకు పునరుత్తేజం ఇచ్చేందుకు చైనా నుంచి పెట్టుబడులు పెంచాలని విజ్ఞప్తి చేశారు. అలాగే, తీస్తా నది సమగ్ర నిర్వహణ, పునరుద్ధరణ ప్రాజెక్టులో చైనా కంపెనీల భాగస్వామ్యం కోసం స్వాగతం తెలిపారు. చైనా ఇస్తున్న రుణాలపై వడ్డీ రేట్లు తగ్గించాలని, కమిట్‌మెంట్ ఫీజులు రద్దు చేయాలని, పలు అభివృద్ధి ప్రాజెక్టులకు మద్దతు ఇవ్వాలని ఆయన కోరినట్లు సమాచారం.

Hyderabad : అర్ధరాత్రి నడి రోడ్డుపై ఇలాంటి పనులేంటి..? సజ్జనార్ ఫైర్ !