Gold Silver Latest Rates: ఈరోజు బంగారం కొనాలని చూస్తున్నారా.. అయితే ఇదే మంచి ఛాన్స్..!

కొంతకాలంగా హెచ్చుతగ్గులకు లోనవుతున్న పసిడి ధరలు (Gold Silver Latest Rates) నేడు స్థిరంగా ఉన్నాయి.

  • Written By:
  • Publish Date - September 15, 2023 / 07:00 AM IST

Gold Silver Latest Rates: కొంతకాలంగా హెచ్చుతగ్గులకు లోనవుతున్న పసిడి ధరలు (Gold Silver Latest Rates) నేడు స్థిరంగా ఉన్నాయి. శుక్రవారం ఉదయం హైదరాబాద్‌లో 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ.54,500గా ఉంది. 10 గ్రాముల 24 క్యారెట్ల పసిడి ధర రూ. 59,450గా నమోదైంది. విజయవాడ, విశాఖపట్నంలో కూడా ఇవే ధరలు అమలవుతున్నాయి. కాగా.. కిలో వెండి ధర రూ.77,000కు చేరుకుంది. ఏపీ, తెలంగాణవ్యాప్తంగా ఇవే ధరలు అమలులో ఉన్నాయి.

బంగారం, వెండి ధ‌రలలో మార్పులు చోటు చేసుకునేందుకు అనేక కారణాలున్నాయంటున్నారు బులియన్‌ మార్కెట్‌ నిపుణులు. అంతర్జాతీయ మార్కెట్ పసిడి ధరల్లో మార్పు, ద్రవ్యోల్బణం, కేంద్ర బ్యాంకుల వద్ద ఉన్న బంగారం నిల్వలు, వాటి వడ్డీ రేట్లు, కరోనా, జువెలరీ మార్కెట్, భౌగోళిక ఉద్రిక్తతలు, వాణిజ్య యుద్ధాలు వంటి తదితర కారణాలు పసిడి రేట్లపై అధిక ప్రభావం చూపే అవకాశం ఉందని బులియన్‌ మార్కెట్‌ నిపుణులు చెబుతున్నారు. ఇక శుక్రవారం (సెప్టెంబర్ 15, 2023) దేశీయంగా బంగారం, వెండి ధరలు ఇలా ఉన్నాయి. ఇక దేశంలోని ప్రధాన నగరాల్లో నేటి ధరల వివరాలివే..!

Also Read: Singapore President: సింగపూర్ 9వ అధ్యక్షునిగా థర్మన్ షణ్ముగరత్నం.. ప్రపంచవ్యాప్తంగా భారతీయుల ఆధిపత్యం..!

బంగారం ధ‌ర‌లు

దేశ రాజధాని ఢిల్లీలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.54,650 ఉండగా, 24 క్యారెట్ల ధర రూ.59,900గా ఉంది. ఇక చెన్నైలో 22 క్యారెట్ల పసిడి ధర రూ.54,800 కాగా.. 24 క్యారెట్ల బంగారం ధర రూ. 59,780గా ఉంది. దేశ ఆర్థిక రాజధాని ముంబైలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.54,500 వద్ద కొనసాగుతుండగా, 24 క్యారెట్ల ధర రూ.59,450 వద్ద ఉంది. కోల్‌కతాలో 22 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధర రూ.54,500 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.59,450గా ఉంది. బెంగళూరులో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.54,500 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.59,450గా ఉంది.

వెండి ధరలు

ఢిల్లీలో కిలో వెండి ధర రూ. 73,500 ఉండగా, ముంబైలో రూ.73,500గా ఉంది. ఇక చెన్నైలో కిలో వెండి ధర రూ.77,000 ఉండగా, కోల్‌కతాలో రూ.73,500గా ఉంది. బెంగళూరులో కిలో వెండి ధర రూ.72,000 ఉండగా, కేరళలో రూ.77,000గా ఉంది. హైదరాబాద్‌లో కిలో వెండి ధర రూ.77,000 ఉండగా, విజయవాడలో రూ.77,000 వద్ద కొనసాగుతోంది. విశాఖ‌ప‌ట్నంలో కూడా ఇదే ధర కొనసాగుతోంది.