Gold- Silver: భారీగా పడిపోతున్న గోల్డ్ రేట్స్.. బంగారంపై రూ. 600, వెండిపై రూ. 2000 తగ్గిన ధరలు..!

కొంతకాలంగా హెచ్చుతగ్గులకు లోనవుతున్న పసిడి ధరలు (Gold- Silver) నేడు మరోసారి భారీగా తగ్గాయి.

  • Written By:
  • Updated On - October 4, 2023 / 07:20 AM IST

Gold- Silver: కొంతకాలంగా హెచ్చుతగ్గులకు లోనవుతున్న పసిడి ధరలు (Gold- Silver) నేడు మరోసారి భారీగా తగ్గాయి. బుధవారం ఉదయం హైదరాబాద్‌లో 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ.52,600గా ఉంది. 10 గ్రాముల 24 క్యారెట్ల పసిడి ధర రూ. 57,380గా నమోదైంది. విజయవాడ, విశాఖపట్నంలో కూడా ఇవే ధరలు అమలవుతున్నాయి. కాగా.. కిలో వెండి ధర రూ.73,500కు చేరుకుంది. ఏపీ, తెలంగాణవ్యాప్తంగా ఇవే ధరలు అమలులో ఉన్నాయి.

బంగారం, వెండి ధ‌రలలో మార్పులు చోటు చేసుకునేందుకు అనేక కారణాలున్నాయంటున్నారు బులియన్‌ మార్కెట్‌ నిపుణులు. అంతర్జాతీయ మార్కెట్ పసిడి ధరల్లో మార్పు, ద్రవ్యోల్బణం, కేంద్ర బ్యాంకుల వద్ద ఉన్న బంగారం నిల్వలు, వాటి వడ్డీ రేట్లు, కరోనా, జువెలరీ మార్కెట్, భౌగోళిక ఉద్రిక్తతలు, వాణిజ్య యుద్ధాలు వంటి తదితర కారణాలు పసిడి రేట్లపై అధిక ప్రభావం చూపే అవకాశం ఉందని బులియన్‌ మార్కెట్‌ నిపుణులు చెబుతున్నారు. ఇక బుధవారం (అక్టోబర్ 04, 2023) దేశీయంగా బంగారం, వెండి ధరలు ఇలా ఉన్నాయి. ఇక దేశంలోని ప్రధాన నగరాల్లో నేటి ధరల వివరాలివే..!

Also Read: Chaiyya Chaiyya Song : ‘ఛయ్యా.. ఛయ్యా’ సాంగ్ మహేష్ బాబు కజిన్ చేయాల్సింది.. కానీ చివరికి మలైకా ఎంట్రీ..

We’re now on WhatsApp. Click to Join

బంగారం ధ‌ర‌లు

దేశ రాజధాని ఢిల్లీలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.52,750 ఉండగా, 24 క్యారెట్ల ధర రూ.57,530గా ఉంది. ఇక చెన్నైలో 22 క్యారెట్ల పసిడి ధర రూ.52,900 కాగా.. 24 క్యారెట్ల బంగారం ధర రూ. 57,710గా ఉంది. దేశ ఆర్థిక రాజధాని ముంబైలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.52,600 వద్ద కొనసాగుతుండగా, 24 క్యారెట్ల ధర రూ.57,380 వద్ద ఉంది. కోల్‌కతాలో 22 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధర రూ.52,600 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.57,380గా ఉంది. బెంగళూరులో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.52,600 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.57,380గా ఉంది.

వెండి ధరలు

ఢిల్లీలో కిలో వెండి ధర రూ. 71,000 ఉండగా, ముంబైలో రూ.71,000గా ఉంది. ఇక చెన్నైలో కిలో వెండి ధర రూ.73,500 ఉండగా, కోల్‌కతాలో రూ.71,000గా ఉంది. బెంగళూరులో కిలో వెండి ధర రూ.69,000 ఉండగా, కేరళలో రూ.73,500గా ఉంది. హైదరాబాద్‌లో కిలో వెండి ధర రూ.73,500 ఉండగా, విజయవాడలో రూ.73,500 వద్ద కొనసాగుతోంది. విశాఖ‌ప‌ట్నంలో కూడా ఇదే ధర కొనసాగుతోంది.