FBI Warning to the Public: మీ ఫోన్ ను పబ్లిక్ ఛార్జర్‌ తో ఛార్జ్ చేస్తున్నారా? FBI ఇచ్చిన వార్నింగ్ చూసుకోండి..

పబ్లిక్ ఛార్జర్‌ల ద్వారా మీ ఫోన్‌లను ఛార్జ్ చేయడం చాలా డేంజర్.. మనలో చాలామందికి అది తెలుసు.. కానీ ఇప్పుడు ఈ హెచ్చరిక FBI నుంచి కూడా వచ్చింది.

FBI warning to the Public : పబ్లిక్ ఛార్జర్‌ల ద్వారా మీ ఫోన్‌లను ఛార్జ్ చేయడం చాలా డేంజర్.. మనలో చాలామందికి అది తెలుసు.. కానీ ఇప్పుడు ఈ హెచ్చరిక FBI నుంచి కూడా వచ్చింది. పబ్లిక్ ఛార్జింగ్ స్టేషన్‌లలో ప్రజలు తమ ఫోన్‌లను ఛార్జ్ చేయకూడదని నోటీసు జారీ చేసింది.పబ్లిక్ ఛార్జర్‌లు హ్యాకర్‌లకు స్వర్గధామంగా మారాయని.. వీటిలోకి హ్యాకర్లు మాల్వేర్‌ చొప్పించి ఉండే అవకాశాలు కూడా ఉంటాయని FBI తెలిపింది. ఆ మాల్వేర్ పరికరాలు మన ఫోన్ లోని గోప్యమైన డేటాను హ్యాకర్లకు పంపుతాయని చెప్పారు. మన ఫోన్ తో లింక్ అయి ఉన్న బ్యాంక్ అకౌంట్ నంబర్ల సమాచారాన్ని కూడా దొంగిలిస్తారని వార్నింగ్ ఇచ్చారు. ఈవిధమైన దాడిని జ్యూస్ జాకింగ్ అంటారని FBI చెప్పింది.ఈరకమైన హ్యాకింగ్ బారిన పడకుండా ఉండటానికి ఉత్తమ మార్గం.. కేబుల్‌తో సహా మీ స్వంత ఛార్జర్‌ను జర్నీలో తీసుకెళ్లడం.

ఇది గుర్తుంచుకోండి..!

వీలైనంత వరకు వేరొకరి ఫోన్ చార్జర్ ను మీ ఫోన్ కు ఉపయోగించవద్దు. అలాగే మీరు మీ ఫోన్ ను ఛార్జింగ్ పెట్టిన సమయంలో మీ ఫోన్ లో బ్యాక్ గ్రౌండ్ అప్లికేషన్స్ ఎక్కువగా ఓపెన్ చేసి ఉన్నా.. కచ్చితంగా ఆ ఎఫెక్ట్ ఫోన్ ఛార్జింగ్ వేగం పై పడుతుంది. కాబట్టి ఛార్జింగ్ పెట్టే సమయంలో బ్యాక్ గ్రౌండ్ లో ఎలాంటి యాప్స్ రన్ అవ్వకుండా చూసుకోవడం మంచిది. లేకపోయినా ఫ్లైట్ మోడ్ లో పెట్టి చార్జింగ్ పెట్టడం చాలా శ్రేయస్కరం.

డేంజర్ అలవాటు..

చార్జింగ్ పెట్టిన సమయంలోనే ఫోన్ ను వివిధ అవసరాల కోసం వాడుతుండటం ఎంతోమందిని గమనిస్తూనే ఉంటాం.ఇలా చేసిన వారి నుండి ఓ సర్వే నిర్వహించారు. కొందరికి చార్జింగ్ చేస్తూ ఫోన్ వాడిన సమయంలో వారి ఫోన్లు వేడిగా అవ్వడం, పేలడం లాంటి సంఘటనలు కూడా చోటు చేసుకున్నట్లు తెలిసింది.

Also Read:  Pragya Jaiswal : సోషల్ మీడియాలో సోకుల సునామీ సృష్టిస్తున్న ప్రగ్యా జైస్వాల్