Site icon HashtagU Telugu

CM Chandrababu : శ్రీవారి భక్తుల దర్శనంపై సీఎం చంద్రబాబు కీలక ఆదేశాలు..

Cm Chandrababu, Br Naidu

Cm Chandrababu, Br Naidu

CM Chandrababu : ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబుతో టీటీడీ ఛైర్మన్ బీఆర్ నాయుడు సమావేశమయ్యారు. టీటీడీ పాలకమండలి తీసుకునే నిర్ణయాలపై బీఆర్ నాయుడు అభినందించారు ముఖ్యమంత్రి. తిరుమలలో భక్తులు క్యూ లైన్‌లో గంటలు వేచి ఉండకుండా, త్వరితగతిన దర్శనం పొందేందుకు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) ద్వారా చర్యలు తీసుకోవాలని ఆలోచిస్తున్నట్టు ముఖ్యమంత్రికి టీటీడీ చైర్మన్‌ వివరించారు. ఈ నిర్ణయానికి చంద్రబాబు పూర్తి సమ్మతి తెలిపారు. ఈ ప్రక్రియను మరింత ముందుకు తీసుకెళ్లేందుకు ఎక్స్‌పర్ట్స్‌తో మూడు సభ్యుల కమిటీని ఏర్పాటు చేయాలని టీటీడీ ఛైర్మన్‌కు సీఎం చంద్రబాబు సూచించారు.

చంద్రబాబు ఈ అంశంపై సానుకూలంగా స్పందిస్తూ, ప్రపంచవ్యాప్తంగా ఉన్న సాంకేతిక సంస్థలతో సంప్రదింపులు జరపాలని, తక్షణమే ఈ నిర్ణయంపై చర్యలు తీసుకోవాలని హామీ ఇచ్చారు. ఆయన మాట్లాడుతూ, “తిరుమలలో భక్తులు వేచి ఉండకుండా, త్వరితగతిన దర్శనం పొందే మార్గాన్ని కనుగొనడం ఎంతో ముఖ్యమైన అంశం” అని పేర్కొన్నారు.

స్విమ్స్ ఆస్పత్రికి సంబంధించి, ప్రతి ఏడాది రూ.100 కోట్లు నష్టం వచ్చిన విషయంపై టీటీడీ ఛైర్మన్, సీఎం చంద్రబాబుకు వినతి పత్రం అందించారు. ఆరోగ్య శ్రీ నుండి రూ.80 కోట్లు అందించాలని కోరారు. ఈ విషయాన్ని త్వరలోనే పరిష్కరిస్తామని ముఖ్యమంత్రి హామీ ఇచ్చారు.

స్విమ్స్‌‌లో నూతన భవనాల నిర్మాణంపై కూడా ముఖ్యమంత్రి దృష్టిని తీసుకెళ్లారు. కానీ, పాలకమండలి నిర్ణయ ప్రకారం, భవనాల నిర్మాణం వెంటనే ఆపాలని సిఫారసు చేయటానికి చంద్రబాబు ఆదేశించారు. తిరుమల ఆలయంలో భక్తులు తోపులాట కారణంగా, నేమ్ బ్యాడ్జ్ వేసే నిర్ణయాన్ని టీటీడీ తీసుకున్నట్లు బీఆర్ నాయుడు ముఖ్యమంత్రికి వివరించారు.

ఎస్వీబీసీ ఛానల్‌కు త్వరలో ఛైర్మన్ నియామకం జరగబోతున్నట్లు టీటీడీ ఛైర్మన్ తెలిపారు. తెలంగాణ ప్రజా ప్రతినిధుల సిఫారసు లేఖలను తిరుమలలో తీసుకున్న నిర్ణయాలపై చంద్రబాబు కృతజ్ఞతలు తెలిపారు. అన్యమతస్థుల అంశంపై కూడా చంద్రబాబు సానుకూలంగా స్పందించారు, వాస్తవానికి పాలకమండలి నిర్ణయాలు తీసుకునే అంశాలపై అతను తక్షణమే నిర్ణయం తీసుకోవాలని ఆదేశించారు.

అంతేకాక, ఎస్వీబీసీలో ఉద్యోగుల ఫిర్యాదుల నేపథ్యంలో అవసరమైన చర్యలు తీసుకోవాలని టీటీడీ ఛైర్మన్ సూచించారు, దీని కోసం కూడా చంద్రబాబు ఓకే ఇచ్చారు. గత ప్రభుత్వ హయాంలో డిప్యుటేషన్ 2పై విధించబడిన ఎనిమిది అధికారులను బదిలీ చేయాలని కోరిన టీటీడీ ఛైర్మన్, చంద్రబాబు తక్షణమే అనుమతి ఇచ్చారు.

Weight Loss : బ్రౌన్‌ షుగర్ లేదా తేనె.. బరువు తగ్గడానికి ఏది ఎక్కువ ప్రయోజనకరం..?