6G-India : ఇప్పుడు 5జీ..
రాబోయేది 6జీ..
5G కంటే 6G ఇంటర్నెట్, టెలికాం సేవలు దాదాపు 100 రెట్లు స్పీడ్ గా ఉంటాయి.
వచ్చే పదేళ్లలో అందుబాటులోకి రానున్న 6జీ టెక్నాలజీ పై భారత్(6G-India) ఇప్పటి నుంచే కసరత్తు మొదలుపెట్టింది. ఇందులో భాగంగా 200 6G పేటెంట్లను కొనుగోలు చేసి.. భారత్ 6G అలయన్స్‌ను ప్రారంభించింది. ఈ అలయన్స్ రాబోయే దశాబ్దంలో అభివృద్ధి చెందుతున్న టెలికాం టెక్నాలజీలు, ప్లాట్‌ఫారమ్‌లపై చర్చించనుంది. కేంద్ర కమ్యూనికేషన్స్, ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ “భారత్ 6G అలయన్స్” ను ఆవిష్కరించారు. 5G విజయవంతంగా విడుదలైన తర్వాత భారతదేశంలో తదుపరి తరం సాంకేతికత (6జీ)ను తీసుకొచ్చేందుకు దీన్ని తొలి అడుగుగా ఆయన అభివర్ణించారు.
Also read : Threads Vs Twitter : ట్విట్టర్ కు పోటీగా ఫేస్‌బుక్ “థ్రెడ్స్” యాప్.. జులై 6న రిలీజ్
“6G టెక్నాలజీ కోసం భారతదేశం 200 పేటెంట్లను పొందింది. రాబోయే 6G సాంకేతికత.. 5G ద్వారా ఇప్పుడు స్థాపించబడిన టెక్నాలజీని మరింత బెటర్ చేస్తాయి. విశ్వసనీయత, వేగం, పరిష్కారాలు మరింతగా పెరుగుతాయి” అని మంత్రి అశ్విని వైష్ణవ్ చెప్పారు. మన దేశంలో గత తొమ్మిది నెలల్లో 2.70 లక్షల 5G సైట్‌లను స్థాపించారు. ఇంకొన్ని సంవత్సరాల్లో ఇండియాలో 6జీని సేవలను ప్రారంభించేందుకు సంబంధించిన విజన్ డాక్యుమెంట్‌ను ప్రధాని మోడీ ఈ ఏడాది మార్చిలో విడుదల చేశారు.