తెలంగాణలో నిర్మాణ రంగం తీవ్ర ఆర్థిక సమస్యలు ఎదుర్కొంటోంది. ఈ క్రమంలో బిల్డర్స్ అసోసియేషన్ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి ఓ లేఖ రాసింది. ప్రభుత్వం చెల్లించలేని స్థాయిలో పనులు అప్పగించడం వల్ల తమ పరిస్థితి దారుణంగా మారిందని ఆ లేఖలో వివరించారు. ప్రత్యేకంగా R&B, పంచాయతీరాజ్ శాఖల కింద చేపట్టిన పనులకు బిల్లులు రావడానికి సంవత్సరాల తరబడి వేచి చూడాల్సి వస్తోందని తెలిపారు.
Virat Kohli Test Retirement: టెస్టులకు విరాట్ కోహ్లీ రిటైర్మెంట్ అంటూ పోస్ట్.. అసలు నిజమిదే!
ప్రభుత్వం తన ఆర్థిక సామర్థ్యానికి మించి టెండర్లు పిలిచి పనులు అప్పగిస్తోందని, అయితే వాటికి సంబంధించిన బిల్లులు మాత్రం సంవత్సరాల తరబడి పెండింగ్‌లో ఉండిపోతున్నాయని వాపోయారు. పలు శాఖలలో ఇప్పటికీ 6-7 ఏళ్లుగా బిల్లులు రావడం లేదని పేర్కొన్నారు. ఇలా నిరంతరం నిధులు లేకుండా ప్రభుత్వ పనులు చేయడం వల్ల తమకు అప్పులు పెరిగిపోయాయని, వ్యక్తిగతంగా ఆర్థిక ఒత్తిడికి లోనవుతున్నామని వివరించారు.
సర్వత్రా కాంట్రాక్టర్లు తీవ్ర ఆర్థిక సంక్షోభంలో ఉన్నారని, ప్రభుత్వం తక్షణమే స్పందించి తగిన నిధులు విడుదల చేయాలని కోరారు. లేదంటే రాష్ట్రంలో ప్రభుత్వ నిర్మాణ పనులన్నీ నిలిచిపోవడమే కాకుండా, నిర్మాణ రంగమే కుంగిపోతుందన్న హెచ్చరికను కూడా లేఖలో చేర్చారు. రాష్ట్ర ప్రభుత్వం సమస్యను గమనించి వెంటనే సానుకూల నిర్ణయం తీసుకుంటుందా అన్నది ఇప్పుడు పరిశ్రమ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది.