Site icon HashtagU Telugu

Bandi Sanjay Follower: బండి సంజయ్ అనుచరుడు సొల్లు అజయ్ వర్మ ఆత్మహత్యాయత్నం

Bandi Sanjay comments over congress winning in Karnataka

Bandi Sanjay Follower: బీజేపీ తెలంగాణ విభాగం అధ్యక్షుడిగా బండి సంజయ్‭ను తప్పించడాన్ని జీర్ణించుకోలేక గత కొద్దిరోజులుగా తీవ్ర మానసిక ఒత్తిడికి లోనైన సొల్లు అజయ్ వర్మ అనే బండి సంజయ్ అభిమాని (Bandi Sanjay Follower) శుక్రవారం పురుగుల మందు తాగాడు. బండి సంజయ్‭కు జరుగుతున్న అన్యాయాన్ని, ఆయనకు జరుగుతున్న అవమానాలను తట్టుకోలేక పోతున్నానంటూ పురుగుల మందు తాగక ముందు అజయ్ వర్మ బాగా రోదించాడు.

ఈ క్రమంలోనే పురుగుల మందు తాగాడు. మానకొండూర్ నియోజకవర్గానికి చెందిన అజయ్ వర్మను తొలుత కరీంనగర్ లోని గ్లోబల్ ఆసుపత్రికి తరలించారు. అతడి వెంట కుటుంబ సభ్యులు, స్నేహితులు ఉన్నారు. అజయ్ పరిస్థితి విషమంగా ఉందని, మెరుగైన చికిత్స కోసం హైదరాబాద్ తరలించినట్లు ఆసుపత్రి వైద్యులు తెలిపారు.

Also Read: Manipur Women Naked Parade : నగ్నంగా ఊరేగించిన ఇద్దరు మహిళల కుటుంబాల గుండెగోడు ఇదీ

మెరుగైన చికిత్స కోసం సికింద్రాబాద్ యశోద ఆసుపత్రిలో సొల్లు అజయ్ వర్మకు అత్యవసర చికిత్స అందిస్తున్నారు వైద్యులు. ఈ విషయం తెలుసుకున్న బండి సంజయ్ హుటాహుటిన యశోద ఆసుపత్రికి చేరుకున్నారు. బండి సంజయ్.. అజయ్ ఆరోగ్య పరిస్థితిపై వైద్యులను అడిగి తెలుసుకున్నారు. హార్బీసైడ్ పురుగుల మందు తాగడంతో ఆరోగ్య పరిస్థితి విషమంగానే ఉందని డాక్టర్లు చెప్పారు. 48 గంటలపాటు ఏమర్జెన్సీ వార్డులో అబ్జర్వేషన్ లో ఉంచి చికిత్స అందిస్తామని డాక్టర్లు బండికి తెలిపారు. మెరుగైన చికిత్స అందించాలని వైద్యులను బండి సంజయ్ కోరారు. ఆందోళన చెందవద్దని అజయ్ కుటుంబ సభ్యులకు బండి సంజయ్ మనోధైర్యం చెప్పారు.