Site icon HashtagU Telugu

Ind Vs Aus: రాణించిన ఆశ్విన్.. 480 పరుగులకు ఆస్ట్రేలియా ఆలౌట్!

India And Australia

India Vs Australia In Indore, India Have An Eye On The Oval, via ahmedabad

భారత్‌తో అహ్మదాబాద్ వేదికగా జరుగుతున్న నాలుగో టెస్టులో ఆస్ట్రేలియా (Australia) జట్టు మొదటి ఇన్నింగ్స్‌లో 480 పరుగులకి ఈరోజు ఆలౌటైంది. మ్యాచ్‌లో రెండో రోజైన శుక్రవారం ఓవర్‌నైట్ స్కోరు 255/4తో బ్యాటింగ్ కొనసాగించిన ఆస్ట్రేలియా జట్టులో ఓపెనర్ ఉస్మాన్ ఖవాజా (180: 422 బంతుల్లో 21×4), కామెరూన్ గ్రీన్ (114: 170 బంతుల్లో 18×4) సెంచరీలు నమోదు చేశారు. దాంతో తొలి ఇన్నింగ్స్‌లో ఏకంగా 167.2 ఓవర్లు ఆస్ట్రేలియా టీమ్ బ్యాటింగ్ చేసింది. భారత్ బౌలర్లలో అశ్విన్ ఆరు వికెట్లు పడగొట్టగా మహ్మద్ షమీ రెండు, రవీంద్ర జడేజా, అక్షర్ పటేల్ చెరొక వికెట్ తీశారు.

గురువారం ప్రారంభమైన ఈ టెస్టు మ్యాచ్‌లో మొదటిరోజే ఓపెనర్ ట్రావిస్ హెడ్ (32), కెప్టెన్ స్టీవ్‌స్మిత్ (38), మార్కస్ లబుషేన్ (3), పీటర్ హ్యాండ్స్‌కబ్ (17) తక్కువ స్కోరుకే ఔటైపోయారు. గురువారమే సెంచరీ మార్క్‌ని అందుకున్న ఉస్మాన్ ఖవాజా (Usman Khawaja).. ఈరోజు 104 పరుగుల ఓవర్‌నైట్ వ్యక్తిగత స్కోరు వద్ద బ్యాటింగ్ కొనసాగించి తొలి రెండు సెషన్ల పాటు వికెట్ ఇవ్వలేదు. దాంతో అతను డబుల్ సెంచరీ సాధించేలా కనిపించాడు. కానీ.. టీమ్ స్కోరు 409 రన్స్ వద్ద అక్షర్ పటేల్ అతడ్ని ఎల్బీడబ్ల్యూగా ఔట్ చేశాడు. మరోవైపు 49 పరుగులతో ఈరోజు బ్యాటింగ్ కొనసాగించిన కామెరూన్ గ్రీన్ దూకుడుగా ఆడేసి సెంచరీ తర్వాత ఔటైపోయాడు. అయితే.. ఈ జోడి ఐదో వికెట్‌కి ఏకంగా 208 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పింది.