Army Jawan Missing : సెలవుపై తన ఇంటికి వచ్చిన ఆర్మీ జవాన్.. అదృశ్యమయ్యాడు.
అయితే అతడి కారులో రక్తపు మరకలు కనిపించాయి..
దీంతో ఆర్మీ జవాన్ పై ఎవరైనా దాడి చేసి.. ఎత్తుకెళ్ళి ఉండొచ్చనే అంచనాలు వెలువడుతున్నాయి.
జమ్మూకశ్మీర్‌లోని కుల్గామ్ జిల్లాలో జరిగిన ఈ ఘటనపై వివరాలివీ..
Also read : INDIA Meet Postponed : “ఇండియా” కూటమి మూడో భేటీ వాయిదా.. మళ్లీ మీటింగ్ ఎప్పుడంటే ?
ఆ ఆర్మీ జవాన్ పేరు జావేద్ అహ్మద్ వనీ. వయసు 25 ఏళ్లు. జమ్మూ కాశ్మీర్‌లోని కుల్గామ్ వాసి. అతడు లేహ్ (లడఖ్)లో ఉన్న ఆర్మీ క్యాంపులో పని చేస్తున్నాడు. మొహర్రం సెలవుపై రెండు రోజుల క్రితమే కుల్గామ్‌లోని తన ఇంటికి వచ్చాడు. శనివారం రాత్రి 8 గంటల నుంచి అతడు కనిపించడం లేదు. జావేద్ అహ్మద్ కారులో రక్తపు మరకలు ఉన్నాయని గుర్తించారు. చెప్పులు కారులోనే ఉండిపోవడాన్ని బట్టి.. ఎవరైనా అతడిని కిడ్నాప్ చేసి ఉండొచ్చని అంచనా వేస్తున్నారు. దీంతో కుల్గామ్ ఏరియాను ఆర్మీ దిగ్బంధించింది. సైన్యం, పోలీసులు కలిసి కార్డన్ సెర్చ్ ఆపరేషన్ నిర్వహిస్తున్నాయి. జావేద్ కిరాణా సామాన్లు కొనేందుకు శనివారం సాయంత్రం చౌవల్గామ్‌కు కారులో వెళ్లాడని కుటుంబీకులు తెలిపారు. అయితే అతడు సామాన్లతో ఇంటికి తిరిగి రాలేదు. మార్గం మధ్యలోనే ఎవరైనా జావేద్ అహ్మద్ వనీని కిడ్నాప్ చేసి ఉంటారని(Army Jawan Missing) అనుమానిస్తున్నారు. గతంలో ఉగ్రమూకలు ఈవిధంగా కాశ్మీరీ ఆర్మీ జవాన్లను, పోలీసులను కిడ్నాప్ చేసిన దాఖలాలు చాలానే ఉన్నాయి.
Also read : Dead Body In Bag : జ్యూస్ కొనిస్తానని ఎత్తుకెళ్లి దారుణం.. ఐదేళ్ల పాపపై హత్యాచారం