Andhra Pradesh : పొలం దున్నుతుండ‌గా బ‌య‌ట‌ప‌డ్డ బంగారు నాణేలు.

ఏలూరు జిల్లా కొయ్యలగూడెం మండలం ఏడువాడలపాలెం గ్రామానికి చెందిన ఓ రైతు పొలం దున్నుతుండగా బంగారు నాణేలు..

Published By: HashtagU Telugu Desk
Gold Coins Imresizer

Gold Coins Imresizer

ఏలూరు జిల్లా కొయ్యలగూడెం మండలం ఏడువాడలపాలెం గ్రామానికి చెందిన ఓ రైతు పొలం దున్నుతుండగా బంగారు నాణేలు బ‌య‌ట‌ప‌డ్డాయి. మొత్తం 18 బంగారు నాణేలతో కూడిన చిన్న మట్టి కుండ కనిపించింది. ఒక్కో నాణెం మూడు గ్రాముల బరువు ఉంటుంది. మానుకొండ సత్యనారాయణ అనే రైతు కొయ్యలగూడెం తహశీల్దార్ పాసం నాగమణికి సమాచారం అందించాడు. ఆ బంగారు నాణేల కుండ‌ను ఎమ్మార్వో స్వాధీనం చేసుకున్నారు. కుండను ఏలూరు జిల్లా కలెక్టర్ కార్యాలయానికి పంపినట్లు తహశీల్దార్ తెలిపారు. దీనిని ట్రెజరీ శాఖకు అప్పగించనున్నారు.

  Last Updated: 06 Dec 2022, 09:17 AM IST