Sreeleela: క్రేజీ ఆప్డేట్.. బాలయ్య కుమార్తెగా శ్రీలీల!

దర్శకుడు అనిల్ రావిపూడి 'ఎఫ్ 3' ప్రమోషన్స్ తో బిజీగా ఉన్నాడు.

  • Written By:
  • Updated On - May 23, 2022 / 05:26 PM IST

దర్శకుడు అనిల్ రావిపూడి ‘ఎఫ్ 3’ ప్రమోషన్స్ తో బిజీగా ఉన్నాడు. ఎఫ్ తర్వాత ఆయన చేయబోయే సినిమాపై ఆసక్తి నెలకొంది. ఇప్పటికే పలుమార్లు బాలయ్యతో సినిమా ఉంటుందని స్పష్టం చేశాడు. అయితే వీళ్లిద్దరి కాంబినేషన్ కు సంబంధించిన ఓ క్రేజ్ అప్డేట్ ప్రేక్షకులను ఆకట్టుకుంటోంది. బాలయ్యకు కుమార్తెగా ‘పెళ్లిసందడి’ నటి శ్రీలీల ఈ చిత్రంలో కీలక పాత్ర పోషిస్తుందని అనిల్ ప్రత్యేకంగా పేర్కొన్నాడు. దీంతో సినిమాపై మరిన్ని అంచనాలు పెరిగాయి.

బాలయ్య సినిమాకోసం ఆసక్తిగా ఉన్న అనిల్ కుర్ర హీరోయిన్ శ్రీలీలకు తండ్రిగా బాలయ్య నటిస్తుండటం మరింత ఆసక్తిని రేపుతోంది. బాలకృష్ణ క్యారెక్టర్‌ని కామెడీతో డిజైన్ చేయడంతో పాటు యాక్షన్ సీన్స్ కు మరింత ప్రాధాన్యతనిస్తున్నారట. అనిల్‌కి కామెడీ బలం అయితే, బాలకృష్ణ సినిమా కోసం మునుపెన్నడూ లేని విధంగా ప్రజెంట్ చేసేందుకు ఆసక్తిగా ఉన్నాడు. “నేను చాలా కాలంగా బాలయ్యతో సినిమా కోసం వెయిట్ చేస్తున్నా. ‘అర్జున్ రెడ్డి’, ‘పోకిరి’, ‘గబ్బర్ సింగ్’ హీరోల మాదిరిగా బాలయ్యను ప్రజెంట్ చేస్తా. ఇది కచ్చితంగా నాకు చాలెజింగ్ లాంటిది” అని అనిల్ వివరించారు. బాలకృష్ణ ప్రస్తుతం గోపీచంద్ మల్లినేని తో వర్క్ చేస్తున్నాడు. ఆ సినిమా తర్వాత అనిల్, బాలయ్య కాంబో సెట్స్ పైకి వెళ్లే అవకాశం ఉంది.