New Ration Cards : ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రేషన్ కార్డు లేని అర్హులైన పేదలకు త్వరలోనే రేషన్ కార్డులు మంజూరు చేయనున్నట్లు ప్రకటించింది. ఈ క్రమంలో, రేషన్ కార్డుల్లో పేర్ల మార్పు, చేర్పు వంటి సవరణలను కూడా వీలు కల్పించనుంది. కుటుంబ సభ్యుల పేర్లు తొలగింపు, చేర్పు, కుటుంబ విభజన, అడ్రస్ మార్పు, రేషన్ కార్డులు ప్రభుత్వానికి సరెండర్ చేయడం వంటి చర్యలను తీసుకునే విధానాన్ని కూడా ప్రభుత్వం త్వరలోనే అమలు చేయనుంది.
ప్రస్తుత నిబంధనల ప్రకారం, గ్రామీణ ప్రాంతాల్లో నెలవారీ ఆదాయం రూ. 10 వేలు, పట్టణ ప్రాంతాల్లో రూ. 12 వేలు మించకుండా ఉండాలని నిర్ణయించబడింది. దీనివల్ల అంగన్‌వాడీ కార్యకర్తలు, అవుట్ సోర్సింగ్ ఉద్యోగులు వంటి వారు రేషన్ కార్డుల అర్హత కోల్పోయారు. వారు ప్రభుత్వ పథకాల నుండి దూరమవ్వడం వల్ల ఆందోళన చెందుతున్నారు. వారు కూడా రేషన్ కార్డులకు అర్హులు కావాలని, ఆదాయ పరిమితిని పెంచాలని కోరుతున్నారు. ఈ పిటిషన్లను పరిగణనలోకి తీసుకుంటూ, ప్రభుత్వం ఆదాయ పరిమితి పెంచే అవకాశంపై కూడా ఆలోచన చేస్తున్నట్లు సమాచారం.
Saddula Bathukamma : కన్నుల పండుగగా వేములవాడలో ‘సద్దుల బతుకమ్మ’ వేడుకలు..
నూతన ప్రభుత్వం ఏర్పడి వంద రోజులు పూర్తయిన సందర్భంగా ఈ నిర్ణయం తీసుకోవడం జరిగింది. రాబోయే మంత్రివర్గ సమావేశంలో దీనిపై విస్తృతంగా చర్చించి, తుది నిర్ణయం తీసుకోనున్నారు. అలాగే, రేషన్ పంపిణీ విధానంలో మార్పులు చేసేందుకు, వాహనాల ద్వారా రేషన్ పంపిణీ చేయడంపై కూడా చర్చ జరగనుంది. ప్రస్తుతం రాష్ట్రంలో 6,000 రేషన్ డీలర్ల స్థానాలు ఖాళీగా ఉండగా, ఈ ఖాళీలను త్వరలోనే భర్తీ చేయనున్నారు. అదే సమయంలో, 4,000 కొత్త రేషన్ దుకాణాలను కూడా ఏర్పాటు చేయడం ద్వారా రేషన్ పంపిణీ వ్యవస్థను మరింత మెరుగుపరచేందుకు ప్రభుత్వం కృషి చేస్తోంది.
ఇదిలా ఉంటే.. తెలంగాణలోనూ కొత్త రేషన్ కార్డులు ఇచ్చేందుకు ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. ఈ నేపథ్యంలోనే అక్టోబర్‌లో కొత్త రేషన్ కార్డుల కోసం దరఖాస్తుల ప్రక్రియ ప్రారంభిస్తామని చెప్పారు. అయితే.. వీలైనంత త్వరగా కార్డులను జారీ చేయడం సహా జనవరి నుంచి రేషన్ కార్డుదారులకు సన్నబియ్యం ఇస్తామని తెలంగాణ మంత్రులు చెప్పారు. కాంగ్రెస్ ప్రజాపాలనతో తెలంగాణలో ఇది మరో విప్లవమాత్మకమైన మార్పు మార్క్ అంటూ పేర్కొన్నారు మంత్రులు. ఇదే కాకుండా.. తెలంగాణ డిజిటల్ ఫ్యామిలీ కార్డులను ప్రవేశపెడుతామని సీఎం రేవంత్ రెడ్డి ప్రకటించారు.
Naim Kassem: సంస్థ పగ్గాలు చేపట్టిన డిప్యూటి చీఫ్ నయూమ్.. ఇజ్రాయెల్‌ను హెచ్చరిస్తూ వీడియో సందేశం..