Nagarjuna Akkineni Clarity: ఆ వార్తల్లో నిజం లేదు : హీరో నాగార్జున

టాలీవుడ్ హీరో అక్కినేని నాగార్జున వైవిధ్యమైన సినిమాలు చేయడంలో ఎప్పుడూ ముందుంటారు.

  • Written By:
  • Updated On - June 29, 2022 / 12:25 PM IST

టాలీవుడ్ హీరో అక్కినేని నాగార్జున వైవిధ్యమైన సినిమాలు చేయడంలో ఎప్పుడూ ముందుంటారు. ఎంతోమంది కొత్త దర్శకులను టాలీవుడ్ కు పరిచయం చేశారాయన. ఇటీవ‌లే ఓ యాక్షన్ థ్రిల్ల‌ర్ మూవీ షూటింగ్ పూర్తి చేసుకున్నాడు. ఇక పాన్ ఇండియా మూవీ ‘బ్రహ్మాస్త్ర’ కీలక పాత్రలో నటిస్తున్నాడు. ఇప్పటికే నాగార్జున కు సంబంధించిన పాత్రపై ఎన్నో అంచనాలు ఏర్పడ్డాయి. హీరో నాగార్జున ఒకవైపు సినిమాలు చేస్తూనే, మరోవైపు బిగ్ బాస్ లాంటి ప్రతిష్టాత్మక షోలకు వ్యాఖ్యాతగా వ్యవహరిస్తున్నారు.

అయితే ఈ నేపథ్యంలో నాగార్జునపై పలు వెబ్ సైట్స్ రూమర్స్ కు తెరలేపాయి. ‘‘నాగార్జున సినిమా ప్రాజెక్ట్స్ తగ్గించుకుని ఇతర అంశాలపై (బిగ్ బాస్) పై దృష్టి పెట్టాలని నిర్ణయించుకున్నాడు‘‘ అని కథనాలు రాశాయి. ఈ విషయమై హీరో నాగార్జున హ్యాష్ ట్యాగ్ యూ (HashtagU) ప్రతినిధితో ఫోన్ లో మాట్లాడారు. తనపై వస్తున్న వార్తలో నిజం లేదని, అవన్నీ వట్టి రూమర్స్ అని నాగార్జున కొట్టిపారేశారు. ప్రస్తుతం బ్రహ్మస్త్రలో నటిస్తున్న నాగార్జున యాక్షన్ థ్రిల్లర్ ‘ఘోస్ట్’ సినిమా షూటింగ్ ను దాదాపు కంప్లీట్ చేశారు. మరో ఐదు రోజుల షూటింగ్ చేయాల్సి ఉంది.  నాగార్జున మరికొన్ని సినిమాలకు సైన్ కూడా చేశారు. త్వరలో ఆ ప్రాజెక్టు వివరాలను వెల్లడించే అవకాశం ఉంది. ఇక అఖిల్ అక్కినేని ‘ఏజెంట్’ సినిమాలో బిజీ ఉండగా, చైతన్య ‘థ్యాంక్యూ’ సినిమాతో మనముందుకు వచ్చేందుకు సిద్దంగా ఉన్నాడు.