Sight Day 2024 : కంటి ఆరోగ్యంపై మహా నిర్లక్ష్యం.. ‘ప్రపంచ దృష్టి దినోత్సవం’ నేడే

కనీసం ఏడాదికి ఒకసారి కంటికి బేసిక్ వైద్య పరీక్షలు (Sight Day 2024) చేయించుకోరు.

Published By: HashtagU Telugu Desk
World Sight Day 2024 Eye Health

Sight Day 2024 : ఇవాళ (అక్టోబరు 10)  ‘ప్రపంచ దృష్టి దినోత్సవం’. కంటి ఆరోగ్యం ప్రాధాన్యాన్ని ప్రపంచ ప్రజలకు చాటిచెప్పడమే ఈ దినోత్సవం ప్రత్యేకత. కళ్లు మన శరీరంలో అత్యంత విలువైన భాగాలు. ఇవి లేని జీవితాన్ని మనం ఊహించుకోలేం. మనిషి ప్రాణం నిలవడానికి గుండె ఆరోగ్యం ఎంత ముఖ్యమో.. మనిషి ఈ లోకాన్ని చూడటానికి, రోజువారీ పనులు సాఫీగా చేయడానికి కళ్లు అంతే ముఖ్యం. మనలో చాలామంది కంటి ఆరోగ్యాన్ని పెద్దగా పట్టించుకోరు. కనీసం ఏడాదికి ఒకసారి కంటికి బేసిక్ వైద్య పరీక్షలు (Sight Day 2024) చేయించుకోరు. దీనివల్ల కంటి సమస్యలు ముదిరిపోయాక బయట పడుతుంటాయి. ఫలితంగా వైద్యఖర్చులు కూడా పెరిగిపోతుంటాయి.

Also Read :Ratan Tata : వీధి కుక్కల కోసం గొంతు వినిపించిన ఘనుడు రతన్ టాటా

కంటి  టెస్టింగ్ ఇలా..

  • ఖర్చు లేకుండా కంటి ఆరోగ్యాన్ని మనమే టెస్టు చేసుకోవచ్చు. ఇందుకోసం తొలుత మన కళ్లలో ఒకదాన్ని మూసివేసి, రెండో దానితో ఒక ప్రదేశాన్ని చూడండి. ఆ తర్వాత మరో కంటిని మూసివేసి, ఇంకో దానితో అదే ప్రదేశాన్ని చూడండి. ఈ రెండుసార్లు ఒక ప్రదేశాన్ని చూసేటప్పుడు ఏదైనా తేడా ఉంటే తప్పకుండా వైద్యుడిని సంప్రదించండి.
  • ఇంట్లో పిల్లలు ఉంటే.. కొంత దూరం నుంచి వారికి వివిధ సైజులు కలిగిన కొన్ని వస్తువులు, పదార్థాలను చూపించండి. వాటిని గుర్తుపట్టమని కోరండి. వాటిని గుర్తు పట్టడంలో పిల్లలు తడబడితే ఒకసారి వైద్యుడితో చెకప్ చేయించండి.

Also Read :Bomb Scare : బాంబులు, ఉగ్రవాదుల కలకలం.. ఆ రైలులో గంటల తరబడి తనిఖీలు

  • ప్రపంచవ్యాప్తంగా దాదాపు 220 కోట్ల మంది కంటి సంబంధిత సమస్యలతో బాధపడుతున్నారు.  వీరిలో 110 కోట్ల మందిలో నివారించదగిన కంటి సమస్యలే ఉన్నాయని గుర్తించారు.
  • పేద, డెవలప్ అవుతున్న దేశాల ప్రజల కంటి ఆరోగ్యాన్ని పెద్దగా పట్టించుకోవడం లేదు.
  • 2020లో వచ్చిన ఒక నివేదిక ప్రకారం..  ప్రపంచవ్యాప్తంగా కంప్యూటర్‌ చూస్తూ  వర్క్స్ చేసేవారిలో దాదాపు  1.3 కోట్ల మంది కంటి సమస్యలను ఎదుర్కొంటున్నారు.  వ్యవసాయం, మత్స్య, నిర్మాణ రంగాల  కార్మికులు కూడా కంటి  సమస్యలతో బాధపడుతున్నారు. యూవీ, ఇన్‌ఫ్రారెడ్ రేడియషన్ వల్ల వీరిలో కంటిశుక్లాల సమస్యల వస్తున్నాయి.
  • కంప్యూటర్ స్క్రీన్‌ను తదేకంగా చూసినా కంటిపై ఒత్తిడి పడుతుంది.
  Last Updated: 10 Oct 2024, 01:44 PM IST