Woman Cop: అమ్మా నీకు వందనం.. మహిళ కానిస్టేబుల్ వీడియో వైరల్!

ఏడు నెలల పాపను ఎత్తుకొని తన డ్యూటీని బాధ్యతయుతంగా నిర్వహిస్తుండటంతో ప్రతిఒక్కరూ ఆమెకు సలాం చేస్తున్నారు.

  • Written By:
  • Updated On - June 7, 2022 / 12:54 PM IST

అస్సాంలోని ఓ మహిళా పోలీసు కానిస్టేబుల్ తన ఏడు నెలల పాపను ఎత్తుకొని తన డ్యూటీని బాధ్యతయుతంగా నిర్వహిస్తుండటంతో ప్రతిఒక్కరూ ఆమెకు సలాం చేస్తున్నారు. సచితా రాణి రాయ్, కాచర్ జిల్లాలోని సిల్చార్ పిఐ కోర్ట్‌లో తన బిడ్డతో కలిసి తిరుగాడుతున్న ఫొటోలు వైరల్ గా మారాయి. ప్రసూతి సెలవు ముగియడంతో.. Ms రాయ్ తన బిడ్డతో ఎత్తుకొని ప్రతిరోజూ ఉదయం 10:30 గంటలకు కార్యాలయానికి చేరుకుంటారు. తన విధులను చక్కగా నిర్వర్తించి తిరిగి ఇంటికి వెళ్తుంది. అయితే ప్రసూతి సెలవులు పూర్తికావడం, ఇంట్లో బిడ్డను చూసేందుకు ఎవరు లేకపోవడంతో బిడ్డతో సహా డ్యూటీ చేయాల్సిన పరిస్థితి ఏర్పడింది.

“నా బిడ్డను చూసుకోవడానికి ఇంట్లో ఎవరూ లేరు కాబట్టి నేను ఆమెను నా వెంట తీసుకురావలసి వచ్చింది. కొన్నిసార్లు అసౌకర్యంగా ఉంటుంది, కానీ నాకు వేరే మార్గం లేదు, ”అని అంటోదీమె. ఈ మహిళ కానిస్టేబుల్  భర్త సెంట్రల్ రిజర్వ్ పోలీస్ ఫోర్స్ (CRPF) జవాన్. సిల్చార్ మలుగ్రామ్ ప్రాంతంలో నివసించే ఈమెకు సహోద్యోగులు, పోలీసు డిపార్ట్‌మెంట్ సహకరించి ప్రత్యేక వసతులు కల్పించారు. “రోజంతా పసిపాప నాతో ఉండటం చాలా కష్టంగా ఉన్నందున నేను కొంచెం ముందుగానే బయలుదేరాను’’ ఆమె చిరునవ్వుతో అంటోంది. మహిళ కానిస్టేబుల్ తన విధులను అంకితభావంతో నిర్వహిస్తుండటంతో ప్రతిఒక్కరూ ఆమె ప్రయత్నాన్ని నెటిజన్స్ అభినందిస్తున్నారు.