Siya Goyal viral video: కేతన్ అగర్వాల్ హత్య కేసు.. సియా గోయల్ అసభ్య సైగ చేసిన వీడియో వైరల్‌

#SHOCKING : Siya Goyal Shows Middle Finger at Journalists Covering Ketan Agarwal Case The footage shows Goyal, who has been arrested in connection with the case, raising her middle finger at reporters while being escorted by police to her residence in Pune’s Market Yard area as… pic.twitter.com/7EuqdrQVxY — upuknews (@upuknews1) July 3, 2026 పూణె వ్యాపారవేత్త […]

Published By: HashtagU Telugu Desk
Ketan Agarwal murder case: Video of Sia Goyal making an obscene gesture goes viral.

Ketan Agarwal murder case: Video of Sia Goyal making an obscene gesture goes viral.

పూణె వ్యాపారవేత్త కేతన్ అగర్వాల్ హత్య కేసులో ప్రధాన నిందితురాలు సియా గోయల్ తాజా ప్రవర్తన వివాదాస్పదంగా మారింది. దర్యాప్తులో భాగంగా పోలీసులు ఆమెను పూణెలోని నివాసం నుంచి బయటకు తీసుకొస్తుండగా మీడియా ప్రతినిధుల వైపు మధ్యవేలు చూపించింది. ఈ దృశ్యాలు వీడియోలో రికార్డ్ అయి సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. ఆమె తీరుపై నెటిజన్లు తీవ్ర విమర్శలు గుప్పిస్తున్నారు.

మరోవైపు చేతన్, సియా రిమాండ్‌ నేటితో ముగియనుంది. దీంతో మరికొన్ని రోజులు రిమాండ్‌కు ఇవ్వాలని పోలీసులు ఈరోజు కోర్టును కోరనున్నారు. అలాగే లోయలోకి తోసి హత్య చేసినట్లుగా నిరూపించడానికి ఆధారాలేమీ లభ్యం కాలేదు. దీంతో నిందితుల పాలిగ్రాఫ్ టెస్ట్‌కు కూడా అనుమతి ఇవ్వాలని కోరనున్నట్లు పోలీసు వర్గాలు తెలిపాయి.

ఈ ఏడాది నవంబర్‌లో సియా, కేతన్ల వివాహం జరగాల్సి ఉందని పోలీసులు తెలిపారు. అయితే కేతన్ తమ సంబంధానికి అడ్డుగా ఉన్నాడని భావించి, చేతన్‌తో కలిసి జూన్ 18న సియా అతడిని హత్యకు పాల్పడినట్లు దర్యాప్తులో తేలిందని వెల్లడించారు. జూన్ 14న కూడా కేతన్‌ను లోయలోకి తోసే ప్రయత్నం చేసినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు.

  Last Updated: 03 Jul 2026, 11:55 AM IST