ISRO Scientist : మొన్న చంద్రయాన్-3 , ఇవాళ ఆదిత్య-ఎల్1 ప్రయోగాలతో ఇస్రో ప్రభంజనం క్రియేట్ చేసింది.
ఓ వైపు చంద్రుడి సీక్రెట్స్ ను.. మరోవైపు సూర్యుడి రహస్యాలను వెలుగులోకి తెచ్చే ప్రయత్నాల్లో ఇస్రో దూసుకుపోతోంది.
ఈ పరిణామాలు దేశ యువతకు అంతరిక్ష రంగంపై, ఆ రంగంలోని ఉద్యోగ అవకాశాలపై ఆసక్తిని పెంచుతున్నాయి.
ఈనేపథ్యంలో ఇస్రో శాస్త్రవేత్త కావాలంటే ఏం చేయాలో తెలుసుకుందా..
Also read : Horrible Incident : భార్యను నగ్నంగా ఊరేగించిన కిరాతక భర్త !
స్కూల్ దశ నుంచే..
ఫ్యూచర్ లో స్పేస్ రీసెర్చ్ చేయాలనుకునే స్కూల్ స్టూడెంట్స్ మ్యాథ్స్‌తో పాటు బేసిక్ సైన్స్ పై అవగాహన పెంచుకోవాలి. మ్యాథ్స్ లో ఆల్జీబ్రా, జామెట్రీపై పట్టు పెంచుకోవాలి. సిలబస్‌లో లేని విషయాలపై కూడా అవగాహన ఉండాలి. ప్రశ్నలకు సమాధానాలు చదువుకునే పద్ధతిలో కాకుండా.. విద్యార్థులు తమంతట తాముగా ప్రశ్నలను క్రియేట్ చేసుకొని ఆన్సర్స్ చెప్పుకునేలా ఉండాలి. ఇవన్నీ స్టూడెంట్స్ లో చిన్నప్పటి నుంచే ఉంటే బెటర్. ఇస్రో శాస్త్రవేత్త కావడానికి కావాల్సింది తపన. ఏదైనా సృష్టించాలనే తపన ఉండాలి. చిన్న వయసు నుంచే ఈ దిశగా కృషి చేయడం వల్ల ఐఐటీ, లేదా ఐఐఎస్‌సీ వంటి విద్యా సంస్థల్లో అవకాశాలు పొందొచ్చు. ఇక ఉన్నత చదువుల సమయంలో సైన్స్ అండ్ టెక్నాలజీ కోర్సులు లేదా ఇంజినీరింగ్ కోర్సులను ఎంపిక చేసుకోవాలి. డిగ్రీలో సైన్స్ లేదా ఇంజినీరింగ్ తప్పనిసరి. జేఈఈ ఎగ్జామ్ రాసి ఐఐటీల్లో బీఈ, బీటెక్ కోర్సులు చేయొచ్చు.
Also read : Aditya L1 Mission LIVE : మరికాసేపట్లో నింగిలోకి ఆదిత్య-ఎల్1
ఈ సంస్థల్లో చదివితే..
- కేరళ రాష్ట్రం తిరువనంతపురం సమీపంలోని వలిమలలో ఉన్న ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ స్పేస్ సైన్స్ అండ్ టెక్నాలజీ (ఐఐఎస్‌టీ)లో కూడా చేరొచ్చు. ఇది భారత ప్రభుత్వ అంతరిక్ష విభాగం (డిపార్ట్‌మెంట్ ఆఫ్ స్పేస్, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా) ఆధ్వర్యంలో నడుస్తున్న డీమ్డ్ యూనివర్సిటీ. ఇందులో బీటెక్, ఎంటెక్, ఎమ్మెస్సీ, పీహెచ్‌డీ కోర్సులు అందుబాటులో ఉన్నాయి. శాస్త్రవేత్తలు కావాలనుకుంటున్న విద్యార్థులు ఈ కోర్సులను చేయొచ్చు.
- ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ స్పేస్ టెక్నాలజీ(ఐఐఎస్‌టీ)లో చదివే వారికి ఇస్రో కార్యకలాపాలపై అవగాహన కలుగుతుంది. ఇస్రో ఎలా పనిచేస్తుంది, అక్కడ పనివిధానం ఎలా ఉంటుందనే విషయాలు తెలుస్తాయి. తాము చదువుతున్న కోర్సులో మంచి ప్రతిభ కనబరిస్తే ఇస్రో శాస్త్రవేత్తగా ఉద్యోగావకాశం కూడా రావొచ్చు.
- ఇస్రోలో చేరేందుకు (ISRO Scientist) ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ స్పేస్ టెక్నాలజీ ఉత్తమ మార్గం. సైంటిస్ట్‌గా ఉద్యోగం పొందాలంటే స్పేస్ ఆర్గనైజేషన్ నిర్వహించే పరీక్షలో కూడా ఉత్తీర్ణత సాధించాల్సి ఉంటుంది.
- ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఆస్ట్రోఫిజిక్స్, టాటా ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఫండమెంటల్ రీసెర్చ్, సాహా ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ న్యూక్లియర్ ఫిజిక్స్, చెన్నైలోని ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మ్యాథమేటికల్ సైన్సెస్ వంటి సంస్థల్లో చదువుకున్న వారిలో ఎక్కువ మంది అంతరిక్ష పరిశోధనల్లో పనిచేస్తున్నారు.