Financial Changes 2025 : కొత్త ఏడాదిలో ప్రజలు ముఖ్యంగా ఫైనాన్షియల్ ప్లానింగ్‌ను రెడీ చేసుకుంటారు. ఆర్థికంగా ఉన్నతిని సాధించాలని కోరుకుంటారు. అలాంటి వారంతా ఈ ఏడాది ఆర్థిక విషయాల్లో జరగబోయే కొన్ని కీలక మార్పుల గురించి తెలుసుకోవాలి. ఇంతకీ అవేంటో ఈ కథనంలో తెలుసుకుందాం..
Also Read :Singer Sivasri : బీజేపీ ఎంపీ తేజస్వి సూర్యకు కాబోయే భార్య ఎవరో తెలుసా ?
ఈ మార్పులు తెలుసుకోండి..
- వాట్సాప్ నిత్య జీవితంలో ఒక భాగంగా మారింది. వాట్సాప్‌తోనే(Financial Changes 2025) ప్రజలు తమ కమ్యూనికేషన్ వ్యవహారాలను నిర్వహిస్తున్నారు. అయితే ఈ ఏడాది కొన్ని పాత స్మార్ట్‌ఫోన్లకు తన మెసేజింగ్ సేవల్ని వాట్సాప్ ఆపేసింది. ఆండ్రాయిడ్ వర్షన్‌లోని శాంసంగ్ గెలాక్సీ ఎస్3, మోటో జీ, హెచ్‌టీసీ వన్‌ఎక్స్, మోటో రేజర్ హెచ్‌డీ, ఎల్‌జీ ఆప్టిమస్ జీ, సోనీ ఎక్స్‌పీరియా జడ్ వంటి ఫోన్లకు వాట్సాప్ సపోర్ట్ ఇక ఉండదు.
- కార్ల ధరలు పెరిగాయి. పెరిగిన ధరలు నేటి నుంచి అమల్లోకి వచ్చాయి. కార్ల ధరలను పెంచిన కంపెనీల లిస్టులో హోండా ఇండియా, మారుతీ సుజుకీ, హ్యుందాయ్, మహీంద్రా, ఎంజీఈ మోటార్, టాటా మోటార్స్, మెర్సిడెస్ బెంజ్, ఆడీ వంటివి ఉన్నాయి.
- మన దేశం నుంచి ఏటా ఎంతోమంది అమెరికాకు వెళ్తుంటారు. అమెరికాకు వెళ్లే భారతీయులు ఈ రోజు నుంచి అమల్లోకి వచ్చిన ఒక రూల్ గురించి తెలుసుకోవాలి. నాన్ ఇమిగ్రెంట్ వీసాకు అప్లై చేసేవారు.. మన దేశంలోని నచ్చిన లొకేషన్‌లో ఇంటర్వ్యూ అపాయింట్‌మెంట్‌ను ఫిక్స్ చేసుకోవచ్చు. ఒకవేళ ఇంటర్వ్యూను రీషెడ్యూల్ చేసుకోవాలని భావిస్తే.. అదనపు ఫీజు కట్టకుండానే ఒకసారి తేదీని మార్చుకోవచ్చు. అయితే రెండోసారి రీషెడ్యూల్ చేసుకుంటే అదనపు ఫీజు కట్టాలి.
- ‘యూపీఐ123పే ’అనే ఫీచర్ ద్వారా పేమెంట్ చేసే లిమిట్ రూ.5 వేల నుంచి రూ.10వేలకు పెరిగింది. ఈ మార్పు ఇవాళ నుంచి అమల్లోకి వచ్చింది. ఈ ఫీచర్ ద్వారా ఇంటర్నెట్ కనెక్షన్ లేకున్నా, ఫీచర్ ఫోన్ ఉన్నా యూపీఐ పేమెంట్ చేయొచ్చు.
- ఆంధ్రప్రదేశ్ గ్రామీణ వికాస్ బ్యాంక్ (APGVB)కు చెందిన తెలంగాణలోని బ్రాంచీలన్నీ ఈ రోజు తెలంగాణ గ్రామీణ బ్యాంక్ (TGB)లో విలీనం అయ్యాయి. ప్రస్తుతం తెలుగు రాష్ట్రాల్లో ఏపీజీవీబీ 771 శాఖలతో పనిచేస్తోంది. ఏపీజీవీబీకి తెలంగాణలో ఉన్న 493 శాఖలు టీజీబీలో విలీనమవుతాయి. దీంతో దేశంలో అతిపెద్ద గ్రామీణ బ్యాంకుల్లో ఒకటిగా తెలంగాణ గ్రామీణ బ్యాంక్ అవతరించింది.
Also Read :Visakha Cruise Terminal : 2025 మార్చి నుంచి విశాఖ క్రూజ్ టెర్మినల్ యాక్టివిటీ.. విశేషాలివీ
- ఈ రోజు నుంచి ఏ దేశం వారైనా థాయ్‌లాండ్ వీసా వెబ్‌సైట్ ద్వారా ఈ- వీసాను పొందొచ్చు. గతంలో థాయ్‌లాండ్ ఈ- వీసా సదుపాయం కొన్ని దేశాల వారికే అందుబాటులో ఉండేది.
- అమెజాన్ ప్రైమ్ వీడియో యూజర్లు ఐదు డివైజ్‌లను ఒకేసారి వాడొచ్చు. అయితే ఈ రోజు నుంచి ఒకేసారి రెండు కంటే ఎక్కువ టీవీల్లో దీన్ని వాడే ఛాన్స్ లేదు. అయితే డివైజ్‌ల సంఖ్యలో మాత్రం ఎటువంటి మార్పు లేదు.