Site icon HashtagU Telugu

National Milk Day : వామ్మో.. పాలలో అవన్నీ కలుపుతున్నారా.. దడ పుట్టిస్తున్న కల్తీ

National Milk Day 2024 White Revolution Verghese Kurien Dairy Products

National Milk Day : ఇవాళ (నవంబరు 26) ప్రపంచ పాల దినోత్సవం. పాలు .. మనం రోజూ వినియోగించే నిత్యావసరం. కొంతమంది పాలు ఇష్టంగా తాగుతారు. ఇంకొందరు ఆ పాలతో చేసిన టీని ఇష్టంగా తాగుతారు. ఇక పెరుగు, నెయ్యి, జున్ను లాంటి ప్రోడక్ట్స్ కూడా పాల నుంచే ఏర్పడుతాయి. అయితే ఇప్పుడు మనం వినియోగిస్తున్న పాలు, పాల ఉత్పత్తులలో చాలావరకు కల్తీ ఉంటోంది. ఈవిషయాన్ని మనం గుర్తించలేకపోతున్నాం. ఇవాళ నేషనల్ మిల్క్ డే సందర్భంగా ఈ దినోత్సవ చరిత్రను, పాలలో కల్తీ వల్ల మన ఆరోగ్యాలకు పొంచి ఉన్న ముప్పు గురించి తెలుసుకుందాం.

Also Read :Constitution Day 2024 : రాజ్యాంగ రచన టీమ్‌లో హైదరాబాద్‌, రాజమండ్రి నారీమణులు.. ఎవరో తెలుసా?

డాక్టర్ వర్గీస్ కురియన్ జయంతి

2001లో ఐక్యరాజ్యసమితిలోని ఫుడ్ అండ్ అగ్రికల్చర్ ఆర్గనైజేషన్ (FAO) ‘ప్రపంచ పాల దినోత్సవాన్ని’  ఏటా జూన్ 1న  నిర్వహించాలని నిర్ణయించింది. పాలు, పాల ఉత్పత్తుల ప్రయోజనాల గురించి ప్రచారం చేయడమే ఆ దినోత్సవం లక్ష్యం. ఇక భారతదేశంలో పాల విప్లవాన్ని తీసుకొచ్చిన డాక్టర్ వర్గీస్ కురియన్ జయంతి సందర్భంగా ఏటా మన దేశంలో  నవంబరు 26న నేషనల్ మిల్క్ డేను నిర్వహిస్తున్నారు. పాలను పాడి పరిశ్రమలోనే వినియోగిస్తారని చాలా మంది భావిస్తారు. వాస్తవానికి వాటిని బ్యూటీ క్రీమ్​లు, మాయిశ్చరైజర్​ల తయారీలో కూడా వాడుతారు.

Also Read :Mohini Dey : ఏఆర్ రెహమాన్ నాకు తండ్రి లాంటివారు : మోహిని దే.. ఈమె ఎవరు ?

పాలను ఇలా కల్తీ చేస్తున్నారు..

ఇంతకుముందు పాలు తాగడం అంటే ఆరోగ్యకరం అని అందరూ భావించేవాళ్లు. ఇప్పుడు ఆ పరిస్థితి లేదు. ఎందుకంటే పాలు ఇచ్చే ఆవులు, గేదెలకు అందించే మేతలో పెస్టిసైడ్స్, కెమికల్స్ ఉంటున్నాయి. అవే పాలలో(National Milk Day) కలిసి వస్తున్నాయి. వాటిని తాగితే.. అవే పెస్టిసైడ్స్, కెమికల్స్ మన శరీరంలోకి వెళ్తున్నాయి. ఫలితంగా వివిధ రకాల ఆరోగ్య సమస్యలు మొదలవుతున్నాయి. ఆహార తనిఖీ అధికారులు, ప్రజారోగ్యశాఖ అధికారులు, పశువసంవర్ధకశాఖ అధికారులు తనిఖీలు అంతగా నిర్వహించడం లేదు. దీనివల్ల కల్తీ పాల విక్రయాలు యథేచ్ఛగా కొనసాగుతున్నాయి. 2 లీటర్ల పాలల్లో యూరియా, వరి పిండి, సోడా వంటివి కలిపేసి.. వాటిని  5 లీటర్ల పాలుగా మారుస్తున్నారు. గేదెలు, ఆవులకు ఆక్సిటోసిన్‌ ఇంజక్షన్‌లు ఇచ్చి పాల దిగుబడిని పెంచుతున్నారు. వాస్తవానికి ఆక్సిటోసిన్‌ ఇంజక్షన్‌ల వినియోగంపై బ్యాన్ ఉంది. గ్లూకోజ్, గంజి పౌడరు, సోడియం హైడ్రాక్సైడ్, జంతువుల కొవ్వు కొన్ని రకాల పాల పొడులను కలిపి పాలను తయారు చేసే వాళ్లు సైతం ఉన్నారు. పాలు ఎంత క్వాలిటీవి వాడినా.. పెరుగులో కొంత నీరు ఉంటుంది. అలా కాకుండా పెరుగు పూర్తిగా గడ్డకడితే.. అవి కల్తీ పాలే అని అర్థం చేసుకోవాలి.